Site icon 10TV Telugu

Raksha Bandhan 2025 : రక్షా బంధన్ స్పెషల్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కోసం AI ఇమేజ్‌లను జనరేట్ చేసే 5 బెస్ట్ ఫ్రీ యాప్స్..!

Raksha Bandhan 2025

Raksha Bandhan 2025

Raksha Bandhan 2025 : రక్షా బంధన్ పండగ సందర్భంగా మీ సోదరుడు లేదా సోదరి కోసం అద్భుతమైన AI ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ప్రత్యేకించి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కోసం AI ఇమేజ్‌లను జనరేట్ చేసేందుకు 5 బెస్ట్ ఫ్రీ యాప్స్ (Raksha Bandhan 2025) అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. పైసా ఖర్చు లేకుండా చాలా ఫ్రీగా పొందవచ్చు.

ఏఐ ఇమేజ్‌లను చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. హై క్వాలిటీ ఏఐ ఇమేజ్‌లను పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా క్రియేటివిటీ ఫొటోలను జనరేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తాయి. ఆర్టిస్టులు, డిజైనర్లు లేదా ఏఐ జనరేటెడ్ ఆర్ట్ ఆసక్తికలిగిన యూజర్లకు సరైనవిగా చెప్పొచ్చు.

జెమిని :
జెమిని ఏఐ టూల్‌లో మీరు ప్రతిరోజూ 10 నుంచి 20 AI ఫొటోలను ఉచితంగా జనరేట్ చేయవచ్చు. చాలా ఈజీగా వివరణాత్మక ఫొటోలను వేగంగా క్రియేట్ చేయొచ్చు. ప్రతిరోజూ పేమెంట్ చేయకుండా ఫ్రీగా వాడొచ్చు. జెమిని ఎంటర్‌టైన్మెంట్ కోసం లేదా వర్క్ కోసం రెగ్యులర్ ఇమేజ్ క్రియేషన్‌కు బెస్ట్ టూల్.

చాట్‌జీపీటీ (DALL·E 3) :
కొత్త ఏఐ ఫీచర్ DALL·E 3 ఉపయోగించి ChatGPT మీకు ప్రతిరోజూ 2 AI ఫొటోలను అందించగలదు. లిమిట్ దాటిన తర్వాత మరిన్ని ఫొటోలను క్రియేట్ చేసేందుకు మీరు 24 గంటలు వేచి ఉండాలి. లిమిట్ ఉన్నప్పటికీ హై క్వాలిటీ క్రియేటివిటీ ఫొటోలను జనరేట్ చేస్తుంది. స్మాల్, క్విక్ ఇమేజ్ ప్రాజెక్టులకు బెస్ట్ టూల్.

Read Also : Happy Rakshabandhan 2025 : రక్షా‌బంధన్ కోసం ChatGPTతో బెస్ట్ AI రాఖీ ఇమేజ్‌లు క్రియేట్ చేయాలా? ఈ సింపుల్ ప్రాంప్ట్స్ ట్రై చేయండి..!

గ్రోక్ (Raksha Bandhan 2025) :
గ్రోక్ ఫ్రీ యూజర్ల కోసం ప్రతి రెండు గంటలకు 10 AI ఇమేజ్ జనరేషన్‌లను అందిస్తుంది. మీరు చేయాల్సిందిల్లా రిఫ్రెష్ చేయడమే. మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పనిలేదు. ఒక రోజులో చాలా ఏఐ ఇమేజ్‌లను జనరేట్ చేయొచ్చు. స్పీడ్ ఇమేజ్ క్రియేటర్లకు అవసరమయ్యే వ్యక్తులకు బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు.

మైక్రోసాఫ్ట్ డిజైనర్ :
మైక్రోసాఫ్ట్ డిజైనర్ ప్రతి నెలా 15 ఫ్రీ ఇమేజ్ క్రెడిట్‌లను అందిస్తుంది. ప్రతి ఇమేజ్‌కు ఒక క్రెడిట్ ఖర్చువుతుంది. క్రెడిట్‌లు ఆటోమాటిక్‌గా నెలవారీగా రెన్యువల్ అవుతాయి. ప్రతిరోజూ ఫొటోలు అవసరం లేకపోయినా క్రియేటివిటీ విజువల్స్ క్రియేట్ చేయడానికి సులభమైన ఏఐ టూల్ కోరుకునే యూజర్లకు సరైన ఆప్షన్.

మెటా AI :
మెటా ఏఐ రోజువారీ లేదా నెలవారీ లిమిట్స్ లేకుండా అన్‌లిమిటెట్ ఫ్రీ ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను ఫీచర్ అందిస్తుంది. చాలా వేగవంతంగా ఉంటుంది. బిగినర్లకు చాలా బెస్ట్ కూడా. ఊహాత్మక రిజల్ట్స్ అందిస్తుంది. మీరు లిమిట్స్ లేకుండా మీకు నచ్చినన్ని ఏఐ ఫొటోలను జనరేట్ చేసేందుకు మెటా ఏఐ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

Exit mobile version