Happy Ugadi 2026 : హ్యాపీ ఉగాది 2026.. మీ ప్రియమైనవారికి బెస్ట్ విషెస్, కొటేషన్లు, గ్రీటింగ్స్ ఇలా పంపండి..!
Happy Ugadi 2026 : హ్యాపీ ఉగాది పండగ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలను తెలపాలని అనుకుంటున్నారా? ఇలా మెసేజ్ పంపండి..
- Sreehari A
- Published On : March 18, 2026 / 02:48 PM IST
Happy Ugadi 2026
- ఉగాది 2026 శుభాకాంక్షలు
- తెలుగు సంవత్సరాది విషెస్
- స్నేహితులు, కుటుంబ సభ్యులకు గ్రీటింగ్స్ పంపొచ్చు
- బెస్ట్ కొటేషన్లతో హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు చెప్పొచ్చు
Happy Ugadi 2026 : ఉగాది వచ్చేస్తోంది. తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరాది ఉగాది ఎంతో ప్రత్యేకమైన పండుగ. 2026లో ఉగాది మార్చి 19న జరుపుకుంటారు. ఈ రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్టు పురాణాల్లో ఉంది. ప్రజలందరూ ఉగాది రోజున ఇళ్లను శుభ్రపరచి, మామిడి ఆకులతో తొరణాలు కడతారు. ఈరోజున ఉగాది పచ్చడి జీవితంలోని 6 రుచులను సూచిస్తుంది. ఇవన్నీ జీవితంలో భాగమని గుర్తు చేస్తుంది.
కుటుంబ సభ్యులు కలిసి పూజలు చేసి కొత్త సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. మీరు కూడా మీకు ఇష్టమైన వారికి స్నేహితులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాలని అనుకుంటున్నాను. మీకోసం కొన్ని సింపుల్ ఉగాది శుభాకాంక్షలు, వాట్సాప్ స్టేటస్, మెసేజ్ లు, గ్రీటింగ్స్, కొటేషన్లు చాలానే ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒకటి మీ ప్రియమైనవారికి పంపుకోవచ్చు.
- అందరికీ ఉగాది 2026 శుభాకాంక్షలు
- ఉగాది మీ జీవితంలో అన్ని అద్భుతాలకు నాంది పలకాలని ఆశిస్తున్నాను.
- ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపద నింపాలని కోరుకుంటున్నాను
- కొత్త ఆరంభాలు మీ జీవితాన్ని విజయంతో నింపాలి. ఉగాది శుభాకాంక్షలు
- మీ ప్రతి కల నిజమవ్వాలి. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి
- ఉగాది పండుగ మీకు శాంతి, సంతోషం తీసుకురావాలి.
- కొత్త ఆశలు కొత్తవిగా, జీవితం రంగులమయంగా మారాలి.
ఈ ఉగాదిని స్వాగతించి, జీవితంలో మంచి మార్పులకు నాంది పలుకుదాం. అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు
