ప్రత్యేక Appలు, Gadgetలు: మహిళల భద్రత కోసమే

భారతదేశంలో ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లిందంటే.. తను తిరిగి వచ్చే వరకు సురక్షితంగా ఉంటుందో లేదో అన్న భయం ప్రతిఒక్క తల్లీదండ్రులకు ఉంది. మరి అలాంటి భయాన్ని పోగొట్టడానికి మహిళల భద్రత కోసం సరికొత్త పరికారలు, యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
* Optisafe.. ప్రమాదాల నుంచి కాపాడే ఎమర్జెన్సీ ట్రాకర్:
ప్రమాదం అనేది ఎవరికి చెప్పిరాదు.. అది ఎక్కడైనా, ఎలాగైనా రావచ్చు. అందుకే ఈ ‘Optisafe’ ను అందుబాటులో ఉంచుకుంటే ప్రమాదం నుంచి ఇట్టే బయటపడొచ్చు. ఇది ఇండియాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ లో రూ.2,999 కి దొరుకుతోంది.
> ఇది ఎలా ఉపయోగపడుతోందంటే ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తుండగా.. ఎవరైనా వచ్చి ఆమెను బెదిరించండం గానీ అసభ్యంగా ప్రవర్తించడం, అఘాయిత్యానికి యత్నించినా గానీ చేస్తే వెంటనే హ్యండ్ బాగ్ కి ఉన్న’Optisafe’ పైన ఉండే క్యాప్ ని తీస్తే వెంటనే సైరన్ మోగుతుంది. దీంతో పాటుగా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి మెసేజ్ వెళ్తుంది. ఆ చుట్టు పక్కల ఉండే వ్యక్తులకు కూడా కూడా ఈ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. అంతేకాదు ‘ఆప్టి సేఫ్’ కు ఉన్న స్పై కెమెరా అక్కడ జరిగే దృశ్యాల ఆడియో..వీడియోలను రికార్డ్ చేస్తుంది.
* హిమత్త్:
ఢిల్లీలో మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’ అనే మొబైల్ యాప్ ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులు మొదట ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత తన పేరు, ఫోన్ నంబర్, ఇద్దరు బంధువుల లేదా స్నేహితుల వివరాలతో ఢిల్లీ పోలీస్ వెబ్ సైటు (www.delhipolice.nic.in) లో నమోదు చేసుకోవాలి.
> మహిళలకు ప్రమాదం కలిగిన సమయంలో ఫోన్ ని ఊపడం లేదా పవర్ బటన్ ను రెండుసార్లు నొక్కడం చేస్తే బంధువుల లేదా స్నేహితులకు ఒక అలర్ట్ వెళ్తుంది. అంతేకాదు ఈ యాప్ నుంచి 30 సెకన్ల వీడియా, ఆడియో రికార్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళుతుంది. దీంతో వెంటనే పోలీసులు బాధితురాలు ఉన్న చోటుకు చేరుకుంటారు.
* హెల్ప్‌లైన్ 112:
ఇంతకముందు వైద్య సేవలకు 108, పోలీస్ సహాయం కోసం 100, ఆగ్నిమాపక శాఖ సహాయానికి 101 నంబర్లను వినియోగించేవారు. అయితే ఇప్పుడు కేంద్రం 112 అనే నెంబర్ ను ప్రవేశపెట్టింది. ఎలాంటి సమస్య అయినా ఈ నంబర్ కు డయిల్ చేస్తే సరిపోతుంది. ఈ సేవలు అన్నీ చోట్ల ప్రారంభమయ్యాయి. బ్యాలెన్స్, అవుట్ గోయింగ్ లేని, ల్యాండ్ లైన్ ఫోన్ లలోనూ ఈ నంబర్ పనిచేస్తుంది.
> ఆపదలో ఉన్నవారు ఫోన్‌లో ఉన్న 112 నంబర్ నొక్కాలి. లేదా స్మార్ట్ ఫోన్ పవర్ బటన్‌ను వెంటవెంటనే మూడు సార్లు నొక్కాలి. అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు కాల్ వెళుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా సాధారణ ఫోన్ అయితే 5 లేదా 9 నంబర్‌ను కొద్ది సేపు నొక్కి పట్టి ఉంచితే ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు.