HMD 2320 Flip 4G : పాత రోజులు మళ్లీ వచ్చేస్తున్నాయా? HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లు కేక..

HMD 2320 Flip 4G : హెచ్ఎండీ 2320 ఫ్లిప్ 4జీ అతి త్వరలో మార్కెట్లోకి రావచ్చని లీకులు చెబుతున్నాయి. యూనిసోక్ టీ127 చిప్, 32GB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 1450mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు..

HMD 2320 Flip 4G

  • స్మార్ట్‌ఫోన్ వద్దనుకునే వారికి అదిరిపోయే ఆప్షన్..
  • HMD కొత్త ఫ్లిప్ 4G వచ్చేస్తోందా? ఫీచర్లు అదుర్స్
  • 32GB వరకు స్టోరేజ్, USB-C ఛార్జింగ్

HMD 2320 Flip 4G : అసలే స్మార్ట్‌ఫోన్ యుగం.. కాసేపు కూడా స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవని పరిస్థితి.. అయితే ఇప్పటికీ కొంతమందికి మాత్రం పాత తరహా కీప్యాడ్ ఫోన్లంటే చాలా ఇష్టపడుతుంటారు.. చిన్న ఫోన్, సింపుల్‌గా వాడే సదుపాయం, ఎక్కువ హంగామా లేని ఫీచర్లు కోరుకునే వారి కోసం హెచ్ఎండీ కంపెనీ మరో కొత్త ఫ్లిప్ ఫోన్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది..

అదే HMD 2320 ఫ్లిప్ 4జీ ఫోన్.. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే కంపెనీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

చిన్న డిస్‌ప్లేలు.. క్లాసిక్ ఫ్లిప్ డిజైన్ :
లీక్ ప్రకారం.. హెచ్ఎండీ 2320 ఫ్లిప్ 4జీలో 2.4 అంగుళాల ఎల్‌సీడీ మెయిన్ డిస్‌ప్లే ఉండనుంది. బయట వైపు 1.77 అంగుళాల మరో స్క్రీన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఫొటోల కోసం 0.3MP ప్రైమరీ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే.. ఫొటోగ్రఫీ కన్నా సాధారణ ఫోన్ అవసరాలకే ఈ హ్యాండ్‌సెట్ ఎక్కువగా వాడొచ్చు..

Read Also : ChatGPT Wallet : చాట్‌జీపీటీలో షాపింగ్ చేసే రోజులు వచ్చేశాయ్.. కొత్తగా వాలెట్ ఫీచర్‌ అదుర్స్.. ఎలా పనిచేస్తుందంటే?

యూనిసోక్ చిప్.. 32GB వరకు స్టోరేజ్:
ఈ ఫోన్‌లో యూనిసోక్ టీ127 చిప్‌సెట్ ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. ఇందులో 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అయితే, మెమరీ కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు..

బ్యాటరీ, కనెక్టివిటీలోనూ స్పెషాలిటీ :
ఈ ఫోన్‌లో 1450mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉండొచ్చు. అంతేకాదు, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నట్లు సమాచారం..

ఎస్ఓఎస్, ఫుష్ టు టాక్ ఫీచర్లు కూడా ఉండొచ్చు.. మొత్తానికి సింపుల్‌గా ఫోన్ వాడాలనే వారికి హెచ్ఎండీ కొత్త ఫ్లిప్ మోడల్ అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. అయితే, ఈ ఫోన్ ధర, లాంచ్ తేదీ, పూర్తి ఫీచర్లపై కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు..