HMD Global just launched Nokia X30 5G for a price of Rs 48,999, Sale Begins From Feb 20
Nokia X30 5G India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ భారతీయ యూజర్ల కోసం నోకియా X30 5G అనే కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో పాటు వివిధ ఆసక్తికరమైన కెమెరాలతో అద్భుతమైన డిజైన్‌ను అందిస్తుంది. భారత మార్కెట్లో నోకియా ఫోన్ ధర రూ. 48,999 నుంచి అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ధర మారవచ్చు. Nokia X30 5G 50-MP ప్యూర్‌వ్యూ కెమెరాను కలిగి ఉంది. 13-MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. AI, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని ఉపయోగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వివిధ కెమెరా సామర్థ్యాలను కూడా కలిగి ఉంది.
నైట్ మోడ్ 2.0, డార్క్ విజన్, ట్రైపాడ్ మోడ్, నైట్ సెల్ఫీలను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ నోకియా X30 5G సెల్ఫీలు, వీడియో కాల్‌లతో 16-MP కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో గోప్రో క్విక్ యాప్ ప్రీఇన్‌స్టాల్ అయి ఉంటుంది. నోకియా యూజర్లు ఎక్కడి నుండైనా ఫొటోలను తీయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల ప్యూర్‌డిస్ప్లేతో 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, సెక్యూరిటీ ఫీచర్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. HMD గ్లోబల్ నోకియా X30 5Gలోని AMOLED ప్యూర్‌డిస్ప్లే టెక్నాలజీతో వచ్చింది. స్ట్రీమింగ్, స్క్రోలింగ్, బ్రౌజింగ్ వంటి ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. అని పేర్కొంది. ఈ డివైజ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.
Nokia X30 5G India : HMD Global just launched Nokia X30 5G for a price of Rs 48,999
నోకియా X30 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు, అన్ని ఇతర Nokia ఫోన్‌ల మాదిరిగానే కొత్త Nokia X30 5G మూడు ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. HMD గ్లోబల్ మూడు ఏళ్ల వరకు నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తోంది.
కొత్త నోకియా X30 5G 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని HMD పేర్కొంది. చివరగా, Nokia X30 5G ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఏకైక మోడల్ ధర రూ. 48,999లకు అందుబాటులో ఉంది. ఈ ధర లిమిట్ పిరియడ్ మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. నోకియా X30 5G ఫిబ్రవరి 20 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం Amazon, అధికారిక వెబ్‌సైట్ Nokia.comలో సేల్ అందుబాటులో ఉంది.