HMD Touch 4G Hybrid Phone
HMD Touch 4G Hybrid Phone : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి హెచ్ఎండీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. కంపెనీ హెచ్ఎండీ టచ్ 4G హైబ్రిడ్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్, రూ. 5వేల కన్నా తక్కువ ధరకే అందిస్తోంది. టచ్‌స్క్రీన్ ప్యానెల్, క్లౌడ్ యాప్‌లు వంటి మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.
అంతేకాదు.. హెచ్ఎండీ ఎక్స్‌ప్రెస్ చాట్ (HMD Touch 4G Hybrid Phone) అనే కొత్త ఫీచర్‌తో ఒక ఏడాదిలోనే గ్యారెంటీ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
భారత్‌లో HMD టచ్ 4G ధర ఎంతంటే? :
హెచ్ఎండీ టచ్ 4G ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ హెచ్ఎండీ ఫోన్ రూ.3,999కు కొనుగోలు చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ హెచ్ఎండీ ఫోన్ డార్క్ బ్లూ, సియాన్ రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
హెచ్ఎండీ టచ్ 4G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
హెచ్ఎండీ టచ్ 4G ఫోన్ 3.2-అంగుళాల టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. రూ. 5వేల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాకుండా, ఈ హెచ్ఎండీ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీని అందిస్తుంది. WiFi హాట్‌స్పాట్, వై-ఫై కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. అంతే కాదు.. బ్లూటూత్‌కు సపోర్టును కూడా అందిస్తుంది. ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్‌లో వర్క్ అవుతుంది. వాయిస్ మెసేజ్‌లు, వీడియో కాల్స్ కోసం ఉపయోగించవచ్చు.
ఆసక్తిగల వినియోగదారులు అప్లికేషన్‌లో 13 వేర్వేరు భాషలలో గ్రూప్ చాట్‌లను పొందవచ్చు. సింగిల్ రియర్ 2MP కెమెరా, VGA ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 2000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో SOS ICE కీ, క్లౌడ్-ఆధారిత యాప్‌లు, HTML 5 గేమ్‌లు, ఆటో కాల్ రికార్డింగ్, mp3 ప్లేయర్ వంటివి ఉన్నాయి.