Honda
Amaze Sub-Compact Sedan : వాహనాల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. కరోనా కారణంగా..ఈ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. కొనుగోళ్లు లేకపోవడం..వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వారు నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో కార్ల తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాయి.
Read More : Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
తాజాగా..వాహన తయారీలో ఉన్న ‘హోండా కార్స్ ఇండియా’ కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో వేరియంట్ ను బట్టి ధరలు నిర్ణయించారు. రూ. 6.32 లక్షల నుంచి రూ. 11.15 లక్షల మధ్య ధర ఉంది. పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్స్ లో వేరియంట్లను ఈ కంపెనీ మార్కెట్ లో ప్రవేశపెట్టింది.
పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్ లో ఇంజన్ ను రూపొందించింది.
Read More : Bank Locker Rules: బ్యాంకుల్లో లాకర్ల రూల్స్‌పై ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!
వేరియంట్ ను బట్టి పెట్రోల్ అయితే..18.6 కిలోమీటర్లు, డీజిల్ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 40 శాతం మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్ ను సొంతం చేసుకున్నట్లు, దక్షిణాఫ్రికా, భూటాన్, నేపాల్ లకు భారత్ నుంచి అమేజ్ కార్లు ఎగుమతి అవుతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ గాకు నకనిశి తెలిపారు.