Honor Pad 20 : కొత్త టాబ్లెట్ కొనాలా? 10100mAh బ్యాటరీతో హానర్ ప్యాడ్ 20 టాబ్లెట్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేయొచ్చు..!

Honor Pad 20 : కొత్త హానర్ టాబ్లెట్ లాంచ్ అయింది. హానర్ 600 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు చైనా మార్కెట్‌లో హానర్ ప్యాడ్ 20 రిలీజ్ అయింది. ఈ టాబ్లెట్ బ్యాటరీ, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Honor Pad 20

  • హానర్ ప్యాడ్ 20 ఫోన్ 12.1-అంగుళాల 3K టీఎఫ్టీ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ ఆప్షన్
  • 8MP ప్రైమరీ కెమెరా, మే 27 నుంచి సేల్స్ ప్రారంభం

Honor Pad 20 : హానర్ లవర్స్ కోసం అద్భుతమైన టాబ్లెట్ వచ్చేసింది. కొత్త టాబ్లెట్ హానర్ ప్యాడ్ 20 ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. హానర్ 600 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఈ ట్యాబ్ రిలీజ్ అయింది. స్టాండర్డ్ ఎడిషన్, సాఫ్ట్ లైట్ ఎడిషన్ లింగ్యు ఎడిషన్‌లలో ఈ టాబ్లెట్ లభిస్తోంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ప్యాడ్ 20 బ్యాక్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ప్రైమరీ కెమెరా ఉంది. 10,100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. హానర్ ప్యాడ్ 20 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

హానర్ ప్యాడ్ 20 ధర :
హానర్ ప్యాడ్ 20 ధర పరంగా 6GB+128GB (లింగ్యూ ఎడిషన్) వేరియంట్‌కు 2099 యువాన్లు (సుమారుగా రూ. 29,420), 8GB+128GB (లింగ్యూ ఎడిషన్) వేరియంట్‌కు 2299 యువాన్లు (సుమారుగా రూ. 32,225), 8GB+128GB (సాఫ్ట్-లైట్ ఎడిషన్) వేరియంట్‌కు 2499 యువాన్లు (సుమారుగా రూ. 35,030) ఉంటుంది.

Read Also : Apple iPhone 15 : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై ఏకంగా రూ. 25 వేలకు పైగా తగ్గింపు.. ఇలా కొన్నారంటే?

8GB+256GB (సాఫ్ట్-లైట్ ఎడిషన్) వేరియంట్‌కు 2699 యువాన్లు (సుమారుగా రూ. 37,830), 8GB+256GB (సాఫ్ట్-లైట్ ఎడిషన్) వేరియంట్‌కు 2999 యువాన్లు (సుమారుగా రూ. 42,035), 3399 యువాన్లు (సుమారుగా రూ. 47,645)గా ఉన్నాయి. 12GB+256GB (సాఫ్ట్-లైట్ ఎడిషన్) ఉన్నాయి. ఈ టాబ్లెట్ ప్రస్తుతం ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. చైనా మార్కెట్లో మే 27 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

హానర్ ప్యాడ్ 20 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ ప్యాడ్ 20లో 3000×1872 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో 12.1-అంగుళాల 3K టీఎఫ్టీ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఈ టాబ్లెట్ అడ్రినో 720 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10.0పై రన్ అవుతుంది. ఇందులో 6GB/8GB ర్యామ్, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. డ్యూయల్ మైక్రోఫోన్‌లతో పాటు 6 స్పీకర్లు ఉన్నాయి. కొలతలు 277.07mm పొడవు, 179.28mm వెడల్పు, 6.29mm మందం, బరువు 525 గ్రాములు ఉంటుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ప్యాడ్ 20 బ్యాక్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ టాబ్లెట్ 10,100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, OTG, సింగిల్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.