Honor Pad 9 First Sale : హానర్ ప్యాడ్ 9 ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్లు, స్పెషిఫికేషన్‌లు ఇవే!

Honor Pad 9 First Sale : హెచ్‌టెక్ మొట్టమొదటి టాబ్లెట్ హానర్ ప్యాడ్ 9 భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ చిప్‌సెట్, 12.1-అంగుళాల డిస్‌ప్లే, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఫ్రీ-బ్లూటూత్ కీబోర్డ్‌తో వస్తుంది.

Honor Pad 9 First Sale : ప్రముఖ హానర్ కంపెనీ నుంచి హానర్ ప్యాడ్ 9 ఫస్ట్ టాబ్లెట్ అమ్మకానికి వచ్చింది. ఈ ప్యాడ్ 9 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ చిప్‌సెట్‌తో వస్తుంది. 8300ఎంఎహెచ్ బ్యాటరీ 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌తో వస్తుంది. 12.1-అంగుళాల డిస్‌ప్లే ఇమ్మర్సివ్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది. అయితే, ఈ టాబ్లెట్ ఫ్రీ బ్లూటూత్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. మీరు ల్యాప్‌టాప్ మాదిరిగా టాబ్లెట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

హానర్ ప్యాడ్ 9 ధర ఎంతంటే? :
హానర్ ప్యాడ్ 9 ధర రూ.24,999గా ఉంది. అయితే, కస్టమర్‌లు నేరుగా రూ. 2వేల ధర తగ్గింపుతో సేల్స్ ఆఫర్‌ను పొందవచ్చు. దాంతో ఈ హానర్ ప్యాడ్ ధరను రూ. 22,999కి కొనుగోలు చేయొచ్చు.

Read Also : Toyota Cars : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టయోటా కార్లు ధరలు

హానర్ ప్యాడ్ 9 స్పెసిఫికేషన్‌లు :
హానర్ ప్యాడ్ 9 అద్భుతమైన డిస్‌ప్లేతో వస్తుంది. 2560 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 249 పిక్సెల్‌ల సాంద్రతతో (పీపీఐ) విజువల్స్‌ను అందిస్తుంది. ఐపీఎస్ డిస్‌ప్లే పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. టాబ్లెట్ విభిన్న లైటింగ్ పరిస్థితుల్లో కూడా స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది.

ఆడియో విషయానికివస్తే..
హానర్ ప్యాడ్ 9 మోడల్ మొత్తం 8 స్పీకర్లు, పెద్ద సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. హిస్టన్ సౌండ్ ఎఫెక్ట్‌ల ద్వారా యూజర్లు సినిమాలు చూస్తున్నా, గేమ్‌లు ఆడుతున్నా లేదా మ్యూజిక్ వింటున్నా డైనమిక్ ఆడియోను పొందవచ్చు. హుడ్ కింద, టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది.

ఆక్టా-కోర్ ప్రాసెసర్ కాన్ఫిగరేషన్‌తో సున్నితమైన పనితీరును అందిస్తుంది. 2.2జీహెచ్‌జెడ్ వద్ద 4 కార్టెక్స్-ఎ78 కోర్లను 1.8జీహెచ్‌జెడ్ వద్ద 4 కార్టెక్స్-ఎ55 కోర్లను కలిగి ఉంది. హై-పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అడ్రినో 710 జీపీయూ గేమింగ్, మల్టీమీడియా అప్లికేషన్‌ల కోసం గ్రాఫిక్స్ రెండరింగ్‌ అందిస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. హానర్ ప్యాడ్ 9 క్లియర్ సెల్ఫీలకు ఎఫ్2.2 ఎపర్చరుతో పాటు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఎఫ్2.0 ఎపర్చర్‌తో 13ఎంపీ బ్యాక్ కెమెరా, షార్ప్ ఇమేజ్‌లు, వీడియోల కోసం ఆటో-ఫోకస్ సామర్థ్యాలను కలిగి ఉంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ మెమరీతో టాబ్లెట్ మల్టీ టాస్కింగ్, యాప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 128జీబీ లేదా 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ని ఎంచుకోవచ్చు. మెమరీ కార్డ్‌ని ఉపయోగించి 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. భారీ ఫైల్‌లు, మీడియా లైబ్రరీలు, అప్లికేషన్‌లకు తగినంత స్టోరేజీని కలిగి ఉంది.

Read Also : OnePlus 12 Discount Offers : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు