Honor Win Turbo : హానర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. భారీ 10,000mAh బ్యాటరీతో కొత్త హానర్ విన్ టర్బో వస్తోంది.. ఫుల్ డిటెయిల్స్!

Honor Win Turbo : ఈ నెలలో హానర్ నుంచి సరికొత్త విన్ టర్బో ఫోన్ రాబోతుంది. రుమర్ల ప్రకారం.. 10,000mAh భారీ బ్యాటరీతో వచ్చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. పూర్తి వివరాలివే..

Honor Win Turbo Launch ( Image Credit : AI )

  • హానర్ విన్ టర్బోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్ ఆప్షన్
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K LTPS ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా
  • హానర్ విన్ టర్బోలో పవర్‌ఫుల్ 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా

Honor Win Turbo Launch : హానర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అతి త్వరలో భారీ బ్యాటరీతో కొత్త హానర్ ఫోన్ వచ్చేస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హానర్ ఈ నెలలో హానర్ విన్ టర్బో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. హానర్ విన్ టర్బోలో 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. గత ఏడాది చివరిలో హానర్ విన్, హానర్ విన్ RT స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా 10,000mAh బ్యాటరీలు ఉన్నాయి.

వీబో పోస్ట్‌లో టిప్‌స్టర్ రాబోయే స్మార్ట్‌ఫోన్ అనేక స్పెసిఫికేషన్లు హానర్ పవర్ 2 మాదిరిగానే ఉండవచ్చని వెల్లడించారు. హానర్ విన్ టర్బో, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ ఉండవచ్చు.

హానర్ విన్ టర్బో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
హానర్ విన్ టర్బోలో 1.5K ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. మెటల్ ఫ్రేమ్‌ కూడా ఉండొచ్చు. హానర్ విన్ టర్బోలో హారిజాంటల్ మ్యాట్రిక్స్ స్టైల్ కెమెరా మాడ్యూల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ప్రస్తుత హానర్ విన్ సిరీస్‌లో మాదిరిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ ఉండదని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

Read Also : Redmi Turbo 5 Launch : వివో, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లకు పోటీగా రెడ్‌మి టర్బో 5 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లపై భారీ అంచనాలివే!

హానర్ విన్ టర్బోలో పవర్‌ఫుల్ 10,000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఈ బ్యాటరీ కంపెనీ ఇంకా వెరిఫై చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హానర్ విన్ టర్బో ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మే 29న చైనాలో లాంచ్ కానుంది.

నివేదికల ప్రకారం.. హానర్ 10,690mAh రేటెడ్ కెపాసిటీతో కొత్త బ్యాటరీ ట్రయల్ ప్రొడక్టు ప్రారంభించింది. ఈ బ్యాటరీ సాధారణ కెపాసిటీ 11,000mAh ఉండగా స్మార్ట్‌ఫోన్‌లో అత్యధిక కెపాసిటీ బ్యాటరీలలో ఇదొకటి. ఈ ఏడాది ప్రారంభంలో హానర్ పవర్ 2 చైనాలో 10,080mAh బ్యాటరీతో లాంచ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 14.2 గంటల గేమింగ్, సుమారుగా 17.3 గంటల నావిగేషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.79-అంగుళాల (1,200 x 2,640 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3,840Hz PWM డిమ్మింగ్, లో బ్లూ లైట్‌కు సపోర్టు ఇస్తుంది.