Honor X9c With Snapdragon 6 Gen 1 SoC Launched
Honor X9c Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి సరికొత్త హానర్ X9c ఫోన్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం.. మలేషియాలో ఈ కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా 12జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. 66డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,600mAh బ్యాటరీ సపోర్టు ఉంది.
హానర్ ప్రకారం.. ఈ హానర్ ఫోన్ 2ఎమ్ డ్రాప్ రెసిస్టెన్స్‌తో పాటు దుమ్ము, 360-డిగ్రీల నీటి నిరోధకతకు ఐపీ65ఎమ్ రేటింగ్‌తో వస్తుంది. హానర్ ఎక్స్9సి ఓఐఎస్ సపోర్టుతో 108ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లో ఆవిష్కరించిన హానర్ ఎక్స్9బీ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన రెస్పాన్స్ పొందింది.
హానర్ ఎక్స్9సి ధర ఎంతంటే? :
మలేషియాలో 12జీబీ + 256జీబీ ఆప్షన్ హానర్ ఎక్స్9సి ధర ఎంవైఆర్ 1,499 (సుమారు రూ. 28,700) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర ఎంవైఆర్ 1,699 (దాదాపు రూ. 32,500). 8జీబీ+ 256జీబీ కాన్ఫిగరేషన్‌తో గ్లోబల్ వెబ్‌సైట్‌లో జాబితా అయింది. అయితే, ఈ ఫోన్ ధర కంపెనీ వెల్లడించలేదు. ఈ హానర్ ఫోన్ జేడ్ సియాన్, టైటానియం బ్లాక్, టైటానియం పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. సింగపూర్‌లో ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది.
హానర్ ఎక్స్9సి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
హానర్ ఎక్స్9సి ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5కె (1,224 x 2,700 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లే, 4,000 నిట్స్ ప్రకాశం, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ అడ్రినో ఎ710 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానర్ ఎక్స్9సి ఫోన్ 5ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 108ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలకు ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెన్సార్ ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 2 మీటర్ల డ్రాప్‌ను అందిస్తుంది. దుమ్ము, 360-డిగ్రీల నీటి నిరోధకతకు ఐపీ65ఎమ్ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
హానర్ ఎక్స్9సి 66డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,600mAh బ్యాటరీతో సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.1, ఓటీజీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ పరిమాణం 162.8 x 75.5 x 7.98ఎమ్ఎమ్, బరువు 189 గ్రాములు ఉంటుంది.
Read Also : iQOO 13 Launch : భారత్‌కు ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!