Apple Scary Fast Event : ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కెమెరా అదుర్స్.. ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌‌ను ఈ ఫోన్‌తోనే షూట్ చేసింది తెలుసా?

Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ సందర్భంగా సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ (iPhone 15 Pro Max)లోని కెమెరాతో షూట్ చేసింది. ఆ వీడియోను మ్యాక్‌లో ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్టు చేసింది.

iPhone 15 Pro Max camera used it to shoot the Apple Scary Fast event

Apple Scary Fast Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్‌తో షూట్ చేసింది. గత నెలలో, ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) మోడల్‌ని ఆవిష్కరించింది. 48MP ప్రైమరీ సెన్సార్‌తో ఉన్న ఈ ఐఫోన్ కెమెరా ఈవెంట్ సమయంలో చాలామంది యూజర్ల దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల నిర్వహించిన స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌తో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కెమెరాతో మరోసారి నిరూపించింది. ఆపిల్ ఈవెంట్‌ని చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఆపిల్ ఎలా షూట్ చేసిందో వీడియోను కూడా కంపెనీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్లో (Apple Scary Fast Event Video ) పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట్లో ఈ వీడియోను ప్రైవేటులో పెట్టిన ఆపిల్ కొన్ని గంటల తర్వాత మళ్లీ లైవ్ చేసింది.

స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తోనే షూటింగ్ :

ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ ఎండ్‌లో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వీక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఒక మెసేజ్ డిస్‌ప్లే చేశారు. ఈ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ మొత్తాన్ని ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌తోనే షూట్ చేయగా.. కొత్తగా లాంచ్ అయిన మ్యాక్స్ సిస్టమ్‌లో ఎడిట్ చేసింది. లొకేషన్, డ్రోన్ ఫుటేజ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ద్వారానే షూట్ చేసినట్టుగా మెసేజ్ కనిపిస్తోంది. అంటే.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) కెమెరా చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పవచ్చు.

Read Also : Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. ఈ M3 సిరీస్ చిప్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలివే..!

ఈ ఐఫోన్ సాయంతో మొత్తం ఈవెంట్‌ను షూట్ చేయొచ్చు. ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ షూట్ సందర్భంగా కొన్ని ఆకట్టుకునే గేమ్‌ప్లే వీడియోలను, క్రిస్టల్ క్లియర్‌గా ఉండే విజువల్స్‌ని ప్రదర్శించింది. ప్రస్తుతం ఈవెంట్ వీడియో (YouTube)లో 2160p రిజల్యూషన్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను అద్భుతమైన కంటెంట్‌ను షూట్ చేసేందుకు రిమైండర్‌గా పనిచేస్తుంది.

ఐఫోన్ 15 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 15 ప్రో గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను మరింత మన్నికైనదిగా బరువు తేలికగా ఉంటుంది. ఈ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఐఫోన్‌లో సన్నని బార్డర్లతో ఉంది. ఫ్రంట్ సైడ్ అదనపు ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. ఈ ఐఫోన్ A17 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. (iPhone 15 Pro) హై రిజల్యూషన్ ఫొటోలను క్లిక్ చేసే సపోర్టుతో 48ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంది.

iPhone 15 Pro Max camera shoot

కెమెరా యూజర్ 3 ప్రముఖ ఫోకల్ లెంగ్త్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది. 24ఎంఎం, 28ఎంఎం, 35ఎంఎం, కొత్త డిఫాల్ట్‌గా కూడా ఎంచుకోవచ్చు. ఐఫోన్ 15 ప్రో విస్తృతమైన 3x టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ప్రో మాక్స్ మోడల్ 5x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది.

స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ అప్‌డేట్స్ ఇవే :

ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ 3 కొత్త చిప్‌సెట్‌లు M3, M3 Pro, M3 Max మోడల్స్ ప్రవేశపెట్టింది. ఈ చిప్‌సెట్‌ల ద్వారా ఆధారితమైన కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, మనకు స్పేస్ బ్లాక్ అనే కొత్త కలర్ వస్తుంది. ఇది మాత్రమే కాదు.. టెక్ దిగ్గజం 14-అంగుళాల మాక్‌బుక్ ప్రో మోడల్‌ను సరసమైన ధరతో అందిస్తోంది. బేస్ M3 చిప్‌తో కూడిన సరికొత్త 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్ ధర రూ. 1,69,900 నుంచి ప్రారంభమవుతుంది.

(Apple M3 Pro), ఎం3 మ్యాక్స్ చిప్‌సెట్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను కూడా ప్రకటించింది. 14-అంగుళాల 16-అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఎం3 ఫ్యామిలీ చిప్‌లతో కూడిన 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 2,49,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఎం3 ప్రో చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,99,900 నుంచి ప్రారంభమవుతుంది.

Apple Scary Fast event

అంతే కాదు.. ఆపిల్ ఎం3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన iMac అప్‌డేట్ వెర్షన్ కూడా ప్రవేశపెట్టింది. కొత్త ఐమ్యాక్ 24-అంగుళాల 4.5K రెటినా డిస్‌ప్లే, 11 మిలియన్ పిక్సెల్‌లు, 500 నిట్స్ బ్రైట్‌నెస్, బిలియన్ కన్నా ఎక్కువ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 1080p ఫేస్ టైమ్ కెమెరా, స్పేషియల్ ఆడియో, స్టూడియో క్వాలిటీ మైక్‌లతో కూడిన 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. కొత్త ఎం3 అప్‌గ్రేడ్‌తో ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : MacBook Pro Discount : ఆపిల్ కొత్త డివైజ్‌లు రిలీజ్ కాగానే.. M2 ప్రో, మ్యాక్‌బుక్ ప్రోపై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు!