Google Driveలో Files పర్మినెంట్ డిలీట్ చేయండిలా!

  • Publish Date - January 2, 2020 / 09:33 AM IST

Google Drive గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జీమెయిల్ అకౌంట్ వాడే ప్రతివారికి గూగుల్ డ్రైవ్ పై అవగాహన ఉండే ఉంటుంది. జీమెయిల్ నుంచి ఏదైనా భారీ ఫైల్స్ అప్‌లోడ్ చేయడం కుదరదు. ఇలాంటి భారీ ఫైల్స్‌ను చాలామంది గూగుల్ డ్రైవ్‌లో షేర్ చేస్తుంటారు. అయితే జీమెయిల్ లోని డేటాను డిలీట్ చేయడం తెలుసు. కానీ, గూగుల్ డ్రైవ్‌లో డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలియదా?

ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లు గూగుల్ డ్రైవ్ లోని ఫైల్స్ డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? గూగుల్ డ్రైవ్ నుంచి ఫైల్స్ డిలీట్ చేసి నేరుగా Trash ఫోల్డర్‌లోకి పంపొచ్చు. లేదంటే.. పర్మినెంట్ గా ఫైల్స్ డ్రైవ్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు… డ్రైవ్ నుంచి ఫైల్స్ ఈజీగా పర్మినెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం..

* ఆండ్రాయిడ్ యూజర్లు మీ ఫోన్లో Google Drive App ఓపెన్ చేయండి.
* స్ర్కీన్ కిందిభాగంలో కుడివైపున Folder icon నొక్కండి.
* ఇక్కడ మీకు డ్రైవ్ లో దాచిన అన్ని ఫైల్స్ లిస్ట్ కనిపిస్తుంది.
* ఫైల్స్ పక్కన (…) మూడు నిలువు డాట్స్ పై Click చేయండి.
* మీరు ఏ ఫైల్స్ Delete చేస్తారో దానిపై Click చేయండి.
* Menu కిందికి Scroll చేయండి.. Remove ఆప్షన్ కనిపిస్తుంది.
* Remove బటన్‌పై Tap చేయండి. ఫైల్ Delete అయిపోతుంది.
* డిలీట్ అయిన ఫైల్.. Google Drive trash లోకి వెళ్తుంది.
* మీ డ్రైవ్ లో సొంత ఫైల్స్, ఇతరులు షేర్ చేసిన ఫైల్స్ డిలీట్ చేయొచ్చు.
* గూగుల్ డ్రైవ్ లోని షేరింగ్ ఫైల్స్ డిలీట్ చేస్తే మీ అకౌంట్లో మాత్రమే కనిపించవు. 
* షేర్ చేసినవారి డ్రైవ్ లో ఆయా ఫైల్స్ యాక్సస్ చేసుకోవచ్చు.

పర్మినెంట్‌గా Files డిలీట్ చేయాలంటే?
* గూగుల్ డ్రైవ్ నుంచి ఫైల్స్ డిలీట్ చేస్తే.. Trashలోకి వెళ్తాయి.
* Google Trash నుంచి పర్మినెంట్‌గా డిలీట్ చేసుకోవచ్చు.
* ఆండ్రాయిడ్‌లో Google Drive app ఓపెన్ చేయండి.
* Top Left menu‌లో Three lines (—)పై Tap చేయండి.
* ఇక్కడ Trash బటన్ పై Tap చేయండి. 
* గూగుల్ డ్రైవ్ లో డిలీట్ చేసిన ఫైల్స్ ఇక్కడే కనిపిస్తాయి.
* డిలీటెడ్ ఫైల్స్ అన్ని పర్మినెంట్ Delete చేయాలంటే (…) పై క్లిక్ చేయండి.
* Delete Forever బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. పూర్తిగా డిలీట్ అయిపోతాయి.

ట్రెండింగ్ వార్తలు