Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదైనా గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా బ్లాక్ చేసేయండి.

Block Unknown Numbers : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదైనా గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వస్తున్నాయా? అయితే వెంటనే ఇలా బ్లాక్ చేసేయండి. డేటా సెక్యూరిటీ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు అన్ నౌన్ ఫోన్ నెంబర్లను కాంటాక్టు లిస్టులో సేవ్ చేసుకోవద్దు. ఇలాంటి ఫ్రాడ్, స్పామ్ ఫోన్ కాల్స్ వస్తుంటే.. వెంటనే బ్లాక్ చేసేయండి. ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేయాల్సిన పనిలేదు. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలోనే డిఫాల్ట్ ఫీచర్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా ఈజీగా అన్ నౌన్ నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.

Google ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా గుర్తుతెలియని ఫోన్ నంబర్‌లను బ్లాక్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. అన్ని స్మార్ట్ ఫోన్లలో బ్లాకింగ్ ఆప్షన్ ఒకేలా కనిపించదు. వేర్వేరు స్ర్కీన్లలో డిఫరెంట్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఫోన్ ఇంటర్ ఫేస్ కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంటుంది. మీకు ఎవరైనా వ్యక్తుల నుంచి తరచుగా అవాంఛిత కాల్స వస్తుంటే.. ఈ బ్లాకింగ్ ఆప్షన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి కాల్స్ రాకుండా నివారించేందుకు సాయపడుతుంది. మీ Android ఫోన్‌లో గుర్తు తెలియని నంబర్‌ను బ్లాక్ చేయడానికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి.

OnePlus Nord 2 5G స్మార్ట్ ఫోన్లతో పాటు నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఫీచర్ ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. మీరు Google Play Store నుంచి మీ Android డివైజ్‌లో Google ఫోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Google Pixel ఫోన్ లేదా Google Phone Samsung, Xiaomi మోడల్‌ స్మార్ట్ ఫోన్లలో ఎలా అన్ నౌన్ నెంబర్లను బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

– మీ ఫోన్ యాప్‌ ఓపెన్ చేయండి.
– డయలర్ సెర్చ్ బార్‌కి టాప్ రైట్ కార్నర్‌లో త్రి డాట్స్ బటన్‌ను నొక్కండి.
– ఇప్పుడు, Settings బటన్‌పై నొక్కండి.. అన్‌నౌన్ బ్లాక్ నెంబర్ ఆప్షన్ On చేయండి.
– Androidలో ఈ బ్లాకింగ్ ఆప్షన్.. ఐఫోన్‌లో భిన్నంగా ఉంటుంది.
– మీ కాలర్ IDలో ‘Private’ లేదా ‘Unknown’గా కనిపించే ఫోన్ కాల్స్ గుర్తిస్తుంది.

Samsung Android ఫోన్‌లో ఎలా బ్లాక్ చేయాలంటే? :

– మీ శాంసంగ్ ఫోన్ యాప్‌ ఓపెన్ చేయండి.
– త్రి డాట్ మెనుని నొక్కండి. ఆపై Settings ఆప్షన్ ఎంచుకోండి.
– బ్లాక్ చేసే నంబర్‌లను Tap చేయండి.
– మీ ఫోన్‌లో ప్రైవేట్ లేదా గుర్తుతెలియని నంబర్‌లను బ్లాక్ చేయడానికి Block ఆప్షన్ నొక్కండి.
– Xiaomi, Android ఫోన్‌లో గుర్తు తెలియని నంబర్‌లను బ్లాక్ చేసుకోవచ్చు.
– Xiaomi నుంచి Android ఫోన్‌లో తెలియని నంబర్‌లను బ్లాక్ చేయడానికి MIUI 12.5 వెర్షన్ ఉండాలి.
మీ డివైజ్‌లో MIUI వెర్షన్‌ మరొకటి ఉంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

– మీ ఫోన్ ఓపెన్ చేయండి.
– Search Bar నుంచి త్రి డాట్ బటన్ నొక్కండి.
– మెను నుంచి సెట్టింగ్‌ ఆప్షన్లను ఎంచుకోండి.
– అన్ నౌన్ నెంబర్లను ఎంపిక చేసి బ్లాక్ చేయండి.
– లేదంటే.. ఫోన్‌లోని డిఫాల్ట్ బ్లాక్ చేసేందుకు ట్రూ కలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ చాలా అందుబాటులో ఉన్నాయి.

Read Also : AP Corona Cases : ఏపీలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు.. ఆ రెండు జిల్లాల్లో వెయ్యికిపైగా నమోదు

ట్రెండింగ్ వార్తలు