Driving Licence Online (Image Credit To Original Source)
Driving Licence Online : మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే, మీ లైసెన్స్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చాలా? ఇటీవలే మీరు కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లో పాత మొబైల్ నెంబర్ కూడా వెంటనే మార్చుకోండి. మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
ఎందుకంటే.. మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డేటా, అప్లికేషన్ స్టేటస్, రెన్యువల్ ఇతర ముఖ్యమైన మెసేజ్‌లు, మీ మొబైల్ నంబర్‌కు వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్‌ను మీ ఇంటి నుంచే ఎలా అప్‌డేట్ చేయవచ్చో పూర్తి ప్రాసెస్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొబైల్ నంబర్ మార్పు కోసం అవసరమయ్యే డాక్యుమెంంట్లు ఇవే :
మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, కొత్త మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం వల్ల మీరు సకాలంలో, ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇంకా, భవిష్యత్తులో లైసెన్స్ రెన్యువల్, అడ్రస్ చేంజెస్ లేదా ఫేక్ లైసెన్స్‌లను పొందేందుకు కూడా మీ మొబైల్ నంబర్ చాలా అవసరం.
Driving Licence Online (Image Credit To Original Source)
డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్ ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి? :
చాలావరకూ, డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను మార్చేందుకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, వివిధ రాష్ట్రాల్లో నియమాలను బట్టి మార్పులు ఛార్జీలు ఉండొచ్చు.
ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకపోతే ఏం చేయాలి? :
ఏదైనా కారణంతో మీ మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకుంటే వెంటనే మీ సమీపంలోని RTO ఆఫీసును కూడా విజిట్ చేయొచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డును మీతో తీసుకెళ్లాల్సి ఉంటుంది.