Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందా? లేదా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి.. ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

How to check if your PAN is linked with Aadhaar

Pan Aadhaar Link : ప్రతి భారతీయ పౌరులు ఎవరైనా తమ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం తప్పనిసరి. కార్డ్ హోల్డర్లందరికీ పాన్ కార్డ్‌లను ఆధార్‌తో లింక్ చేయడాన్ని భారత ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఆధార్, పాన్ లింకింగ్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలనేది చాలామందికి అవగాహన ఉండదు.

కొంతమంది పాన్ కార్డు ఆధార్ లింక్ చేసుకున్నా తర్వాత అది పూర్తి స్థాయిలో లింక్ అయిందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదని గమనించాలి. అందుకే ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్లో ఆధార్, పాన్ లింక్ అయిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్‌ను ఆధార్‌తో ఎందుకు లింక్ చేయాలి? :
ఆధార్‌తో పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను లింక్ చేయాలి. తద్వారా పన్ను చెల్లింపులు, టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్‌లు, ఆదాయ రిటర్న్‌లు, లావాదేవీలు, కరస్పాండెన్స్‌లతో సహా వ్యక్తిగత లావాదేవీలను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది.

Read Also : OnePlus Nord CE 3 Lite : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్.. కేవలం రూ.18,499 మాత్రమే.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

గడువు తేదీ ముగిసింది :
జూన్ 30 అనేది పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన నిర్ణీత గడువు. జూలై 1 తర్వాత పాన్ కార్డ్ పని చేయకపోవటంతో రెండు కార్డ్‌లను లింక్ చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను ఓసారి పరిశీలించండి.

ధృవీకరణ ప్రక్రియ :
పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పాన్ కార్డు ఎలా ధృవీకరించాలో తెలుసుకోండి. మీ పాన్ కార్డ్ యాక్టివ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం.

ఐటీఆర్ తిరస్కరణ :
మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు దాఖలు చేసిన ఐటీఆర్ రిజక్ట్ అయితే మీ పాన్ కార్డు ఆధార్ లింక్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.

PAN linked with Aadhaar

మినహాయింపులు :
80 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నివాసితులు కానివారు, భారత పౌరులు కాని వారితో సహా ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం నుంచి మినహాయించిన నిర్దిష్ట గ్రూపులుగా చెప్పవచ్చు.

లింకింగ్ ప్రక్రియకు అవసరమైనవి :
వ్యాలీడ్ పాన్ కార్డు – యాక్టివ్ మొబైల్ నంబర్

పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.
* ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (incometax.gov.in/iec/foportal/)ను విజిట్ చేయండి.
* Quick Links సెక్షన్ నావిగేట్ చేయండి. లింక్ ఆధార్ స్టేటస్ ఎంచుకోండి.
* పాన్, ఆధార్ కార్డ్ నంబర్‌లను ఎంటర్ చేయండి
* ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
* స్క్రీన్ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది.
* పాన్ కార్డ్, ఆధార్ లింక్ అయితే స్క్రీన్ ‘Linked’ అని సూచిస్తుంది.
* లింక్ చేయకపోతే.. రెండు కార్డ్‌లను లింక్ చేయడానికి అవసరమైన వివరాలను సూచిస్తుంది.

Read Also : Hyundai Cars Discounts : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు