Check Your Credit Score : క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే లోన్ వస్తుంది.. సిబిల్ స్కోరు ఎలా చెక్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

How To Check Your Credit Score Before Applying For Loan

How to Check Your Credit Score Online : భారత్‌లో క్రెడిట్ బ్యూరోలలో ఒకటైన (CIBIL) ద్వారా క్రెడిట్ స్కోర్ రూపొందిస్తుంది. మీ క్రెడిట్ హిస్టరీ మూడు-అంకెలతో కలిగి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ స్కోరు అనేది 300 నుంచి 900 మధ్య ఉండవచ్చు. ఒక వ్యక్తి కనీసం 6 నెలల చారిత్రక ఆర్థిక డేటా ఆధారంగా లెక్కిస్తుంటారు. CIBIL స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ (How to Check Credit Score) అనేది ఒకరి క్రెడిట్ కార్డ్ హిస్టరీ, రుణగ్రహీత విశ్వసనీయతను తెలుసుకోవడానికి ప్రతి బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ చెక్ చేసే మొదటి విషయమని చెప్పవచ్చు.

How To Check Your Credit Score

సిబిల్ స్కోరు ఎంత ఉండాలి? :

భారత్‌లో క్రెడిట్ బ్యూరోలలో ఒకటైన సిబిల్ ద్వారా క్రెడిట్ స్కోర్ రూపొందిస్తారు. సిబిల్ స్కోర్ మీ క్రెడిట్ హిస్టరీ మూడు-అంకెలను కలిగి ఉంటుంది. సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉండవచ్చు. మీ క్రెడిట్ స్కోరు 750-900 మధ్య ఉంటే.. అద్భుతమైనదిగా చెప్పవచ్చు. అయితే, గుడ్ క్రెడిట్ (Good CIBIL Score) స్కోర్ 650-750 పరిధిలో వస్తుంది. సిబిల్ స్కోర్ 550-650 మధ్య సగటు కేటగిరీలో వస్తుంది. అదే, 300-500 పరిధిలో వచ్చేది పూర్ కేటగిరీ కింద వస్తుంది.

Read Also : Credit Card Portability: మీ క్రెడిట్, డెబిట్ కార్డులకుకూడా పోర్టబిలిటీ సదుపాయం.. ఎప్పటి నుంచి..? ఎలానో తెలుసుకోండి..

ఆన్‌లైన్‌లో CIBIL స్కోర్‌ను ఎలా చెక్ చేయాలంటే? :
ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోర్‌ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ ఒక వ్యక్తి కనీసం ఆరు నెలల చారిత్రక ఆర్థిక డేటా ఆధారంగా లెక్కిస్తారు. ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌లో అధికారిక వెబ్‌సైట్ (Cibil Score Website)  ఓపెన్ చేయండి. అందులో ఒక ఫారమ్‌ను నింపండి. అంటే.. మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి అడ్రస్, పిన్ కోడ్, ఐడి ప్రూఫ్, గత లోన్ హిస్టరీ, ఇతర సంబంధిత సమాచారం వంటి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి.

How To Check Your Credit Score Online

ఏడాదిలో ఒకసారి మాత్రమే ఉచితం :
మీ వివరాలను వెరిఫై చేయడానికి వెబ్‌సైట్ మీకు OTPని పంపుతుంది. సిబిల్ మరింత సమాచారం కోసం మీ వివరాలను అడగవచ్చని గమనించాలి. హోమ్ లోన్ (How to apply Home Loan), క్రెడిట్ కార్డ్ (How to apply for Credit Card) మీ మొబైల్ ఫోన్ వంటి మీ వివిధ రుణాల వివరాలన్నీ మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి. ఒకసారి అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాత.. మీ CIBIL స్కోర్ రిపోర్టును ఉచితంగా అందుకుంటారు. సిబిల్ మీకు ఒక CIBIL స్కోర్ రిపోర్టును క్యాలెండర్ సంవత్సరంలో ఒకసారి ఎలాంటి ఛార్జీ లేకుండా అందిస్తుంది.

సిబిల్ స్కోరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే :

మీ CIBIL స్కోర్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయాలనుకుంటే.. మీరు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. రూ. 550కి 1 నెల బేసిక్ ప్లాన్, రూ. 800కి 6 నెలల స్టాండర్డ్ ప్లాన్, రూ. 1200కి ప్రీమియం 1 ఇయర్ ప్లాన్ పొందవచ్చు. మీరు CIBIL వెబ్‌సైట్‌ని కూడా విజిట్ చేయొచ్చు. ప్రతి ప్లాన్‌లో అందించే ఫీచర్లు, అధికారిక వెబ్‌సైట్ కాకుండా మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి అడ్రస్, పిన్ కోడ్, PAN కార్డ్ నంబర్‌ను అందించడం ద్వారా (Paisabazar.com), (IIFL), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) మొదలైన ఇతర వెబ్‌సైట్‌లలో కూడా మీ CIBIL స్కోర్‌ను చెక్ చేయవచ్చు.

Read Also : Good Credit Card Score : గుడ్ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. మీ క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలుసా? ఈ 5 విషయాలు తప్పక పాటించండి!

ట్రెండింగ్ వార్తలు