Clean Your Phone : అసలే కరోనా సీజన్.. అందుకే పదేపదే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేది.. అన్ని వేళలా చేతులు కడుక్కోవచ్చు. కానీ చేతిలో వాడే డివైజ్ లను ప్రతిసారి క్లీన్ చేయడం సాధ్యపడదు.. అదే చేత్తో ఫోన్ వంటి డివైజ్‌లను ముట్టుకుంటారు.. ఆ చేతులనే అలానే నోట్లో పెట్టేసుకుంటారు. దీంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇలాంటి కరోనా సమయంలో వ్యాప్తి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏదైనా డివైజ్ టచ్ చేసినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. కనీసం 20 సెకన్ల పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కుంటారు.. బాగానే ఉంది.. మరీ డివైజ్ లను శానిటైజ్ చేయడం లేదా? మీరు వాడే ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి డివైజ్ లను తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్, కీబోర్డ్, మౌస్‌లను చివరిసారిగా ఎప్పుడు క్లీన్ చేశారో చెప్పండి.. ఇటీవలే ఒక అధ్యయనం ప్రకారం.. కరోనావైరస్ డివైజ్ లాంటి ఉపరితలాలపై కనీసం 9 గంటల పాటు ఉంటుందని వెల్లడించారు. ఫోన్లపై ఉండే బ్యాక్టరీయా టాయిలెట్ సీటు కంటే పది రెట్లు అధికంగా ఉంటాయని ఒక అధ్యయనంలో తేలింది..
అందుకే తప్పనిసరిగా డివైజ్ లను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. University of Southamptonకు చెందిన ప్రొఫెసర్ William Keevil సూచించిన ప్రకారం.. చేతులను తరచుగా కడుక్కోవాలి. కానీ, స్మార్ట్ ఫోన్ టచ్ చేసిన ప్రతిసారి మీరు మీ ముఖాన్ని కూడా ముట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. Public Health England (PHE) సలహాల ప్రకారం.. యూకేలో కరోనా సంబంధించి అన్నింటిని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
తరచూ ముట్టుకునే వస్తువులను సాధ్యమైనంత ఎక్కువసార్లు శానిటైజ్ చేసుకోవడం ఎంతో ఉత్తమమని సూచించారు. నిత్యం వాడే డివైజ్ లను కూడా రోజులో కనీసం రెండు సార్లు అయిన శానిటైజ్ చేసుకోవడం ఆరోగ్యకరమైనదిగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బ్యాక్టరీయాలను 62 శాతం నుంచి 71 శాతం వరకు ఎథనాల్ సాయంతో క్లీన్ చేయొచ్చు. 0.5శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా 0.1 శాతం సోడియం హైప్రోక్లోరైట్ ను ఒక నిమిషంలోనే క్లీన్ చేసుకోవచ్చు.
సున్నితమైన డివైజ్ లపై ఘాటైన రసాయానలతో క్లీన్ చేయడం వల్ల ఫోన్ల స్ర్కీన్ పై ఉండే ఫింగర్ ఫ్రింట్ కోటింగ్ పోయే అవకాశం ఉంది. తద్వారా స్ర్కీన్ టచ్ సమస్యలు వస్తాయని అంటున్నారు. మరేం చేయాలంటే?.. ఫోన్ ముందుగా స్విచ్ఛాప్ చేయమని సూచిస్తోంది ఆపిల్ కంపెనీ.. ఒక సున్నితమైన వస్త్రంతో తుడవాలని చెబుతోంది. అద్దాలను తిడిచే క్లాత్ మాదిరిగా ఉండాలని సూచిస్తోంది.
వేడి సబ్బు నీళ్లతోముంచిన సుతిమెత్తని కాటన్ అయిన పర్వాలేదు.. ఛార్జింగ్ పోర్ట్ లు వంటి భాగాల్లో లిక్విడ్ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొన్ని ఆల్కహాల్ ఆధారిత ప్రొడక్టులు ఘాటైనవి కూడా మార్కెట్లో ఉన్నాయి.. అందుకోసం చీప్ స్ర్కీన్ ప్రొటెక్ట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Clorox లేదా Lysol వాడటం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ క్లీన్ చేసుకోవచ్చు. పోర్ట్స్ ఉన్న భాగాల్లో మినహా డివైజ్ ను శానిటైజ్ చేసుకోవచ్చు. ఫోన్ స్ర్కీన్ టచ్ చేసిన ప్రతిసారి చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.. అందులోనూ తినేముందు కచ్చితంగా చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.