×
Ad

Whatsapp Meta AI : వాట్సాప్‌లో మెటా AIతో యానిమేటెడ్ వీడియోలు ఇలా క్రియేట్ చేద్దాం.. ఇదిగో స్టెప్ బై స్టెప్ గైడ్..!

Whatsapp Meta AI : వాట్సాప్‌‌లో మెటా ఏఐతో అద్భుతమైన యానిమేటెడ్ వీడియోలను క్రియేట్ చేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Whatsapp Meta AI

Whatsapp Meta AI : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్.. మెటా ఏఐతో వాట్సాప్‌లో నేరుగా యానిమేటెడ్ వీడియోలను క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతం వాట్సాప్ (Whatsapp Meta AI) అనేది అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్‌. యూజర్ల ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

ఇప్పుడు వాట్సాప్ మెటా ఏఐ సాయంతో యాప్‌లోనే నేరుగా యానిమేటెడ్ వీడియోలను క్రియేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ స్టేటస్ అప్‌డేట్స్ కోసం వినియోగించుకోవచ్చు.

Read Also : Jio vs Airtel : నెలవారీ రీఛార్జులతో విసిగిపోయారా? జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ వార్షిక ప్లాన్లు.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు..!

యానమేటెడ్ వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి? (Whatsapp Meta AI) :

  • మెటా ఏఐ (Meta AI)తో వాట్సాప్‌లో యానిమేటెడ్ వీడియోలను ఇలా క్రియేట్ చేయొచ్చు.
  • యానిమేటెడ్ వీడియోల కోసం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ సెక్షన్‌కు వెళ్లండి.
  • మీ స్టేటస్ అప్‌డేట్స్ కోసం వివిధ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • ఏఐ ఫొటోస్ ఆప్షన్ ద్వారా వీడియో యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు.
  • స్టేటస్ కేటగిరీలో ‘AI Photos’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు యానిమేట్ చేసే ఫొటోకు ఏ క్యాప్షన్ అవసరమో ఇవ్వాలి.
  • మీ క్యాప్షన్ ఎంటర్ చేశాక ‘Make Changes’పై క్లిక్ చేయండి.
  • మీ ఫొటో యానిమేషన్‌గా జనరేట్ అయ్యే ముందు ఎడిట్ లేదా అప్‌గ్రేడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
  • ‘Animate’పై క్లిక్ చేయాలి.
  • మీ స్టాటిక్ ఫొటో డైనమిక్ యానిమేటెడ్ వీడియోగా జనరేట్ అవుతుంది.

ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీ స్టేటస్ అప్‌డేట్స్ మరింత క్రియేటివిటీగా మార్చుకోవచ్చు. మీరు ఈ యానిమేటెడ్ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు చేరేలా నేరుగా మీ స్టోరీలో పోస్ట్ చేయవచ్చు.

ఈ ఆకర్షణీయమైన ఫీచర్ స్టేటస్ అప్‌డేట్స్ మరింత ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చు. మెటా AI వంటి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో తమ స్మార్ట్‌ఫోన్ల నుంచే ఆకర్షణీయమైన యానిమేటెడ్ కంటెంట్‌ను ఈజీగా క్రియేట్ చేయొచ్చు.