Download Aadhaar Card : మీ మొబైల్‌లో ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Download Aadhaar Card : మీ ఆధార్ కార్డు ఇంటి వద్దనే వదిలేశారా? ఏదైనా అత్యవసర సమయాల్లో మీరు ఆధార్ కార్డును ఎక్కడ ఉన్నా సరే ఈజీగా మొబైల్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

How to Download Aadhaar Card : మీరు ట్రిప్ వెళ్లిన సమయంలో మీ ఆధార్‌ను తీసుకెళ్లడం మర్చిపోయారా? అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కంగారుపడొద్దు. మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్ నుంచి ఇ-కాపీని ఎప్పుడైనా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌లో ఉచితంగా ఇ-ఆధార్‌ను (e-aadhaar) డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ సర్వీసును అందిస్తుంది. ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ (e-aadhaar card download) ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. UIDAI ఆన్‌లైన్‌లో ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మల్టీ మెథడ్స్ అందిస్తుంది.

ఆధార్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ ఎలా? :

మీ ఆధార్ నంబర్‌ను మీ దగ్గర ఉంచుకోండి. ఈ 6 సులభమైన దశల్లో మీ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1. ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (Aadhaar Official Website) ని విజిట్ చేసి ‘Aadhaar Number’ని ఎంచుకోండి.
2. మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
3. Captcha కోడ్‌ని Type చేయండి.
4. ‘Send OTP‘పై నొక్కండి.
5. ఇప్పుడు, ‘మీకు మాస్క్‌డ్ ఆధార్ కావాలా?’ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేసి, ఆపై ‘Verify & Download’ ఆప్షన్ క్లిక్ చేయండి.

Download Aadhaar Card in Telugu

6. మీ డౌన్‌లోడ్‌ల ఫోల్డర్‌లో పాస్‌వర్డ్-ప్రొటెక్షన్ ఆధార్ కార్డ్ PDF డాక్యుమెంట్ కనిపిస్తుంది. మీ ఆధార్‌ను చూసేందుకు పాస్‌వర్డ్ క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, సంవత్సరం (YYYY) ఫార్మాట్‌లో మీ పుట్టిన తేదీ సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి.

‘‘Note : Mask Aadhaar‘ కార్డ్ మీ సాధారణ ఆధార్ లాంటిది. అయితే, మీ ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలను మాత్రమే చూపుతుంది. మిగిలిన వాటిని హైడ్ చేస్తుంది. ఈ డిజైన్ మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది. మీ సాధారణ ఇ-ఆధార్ మాదిరిగానే చెల్లుబాటు అవుతుంది.’’

పేరు, పుట్టిన తేదీతో ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
మీకు మీ ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ID లేదా వర్చువల్ ID గుర్తులేకపోతే.. మీ పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా మీ ఇ-ఆధార్‌ను పొందవచ్చు. ఈ కింది విధంగా ప్రయత్నించండి.

Read Also : Lost Aadhaar Card : మీ ఆధార్ కార్డు కోల్పోయారా? ఆన్‌లైన్‌లో కొత్త ఆధార్ ఎలా పొందాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

1. మైఆధార్ వెబ్‌సైట్ (myaadhaar-uidai) ని విజిట్ చేయండి.
2. మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
3. Captcha/సెక్యూరిటీ కోడ్‌ని Type చేయండి.
4. ‘Send OTP’ ఆప్షన్‌పై Click చేయండి.
5. మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ID/మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేయండి (మీరు ఎంచుకున్న ఆప్షన్ ఏదైనా) ‘Verify Your OTP’ని నొక్కండి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్/ఎన్‌రోల్‌మెంట్ ID పంపే మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
7. మీకు పంపిన 28-అంకెల ఎన్‌రోల్‌మెంట్ ID లేదా 12-అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను టైప్ చేయండి. ‘Send OTP’పై క్లిక్ చేయండి.
8. మీ ఇ-ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ‘Verify & Download’ బటన్‌ను నొక్కండి.
9. మీరు డౌన్‌లోడ్ చేసిన ఇ-ఆధార్‌ని వీక్షించడానికి 8-అక్షరాల పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. మీ పేరులోని మొదటి 4 అక్షరాలను క్యాపిటల్ లెటర్స్‌లో మీ పుట్టిన సంవత్సరం (YYYY ఫార్మాట్‌లో) టైప్ చేయండి.

Download Aadhaar Card Online Mobile

డిజిలాకర్ (DigiLocker) నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

DigiLocker అనేది ‘డిజిటల్ లాకర్’ లాంటిది. మీ అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఇతర ధృవపత్రాలను డిజిటల్ రూపంలో స్టోర్ చేయడానికి సేఫ్ క్లౌడ్-ఆధారిత స్టోరేజీగా పిలుస్తారు. మీ డిజిలాకర్ అకౌంట్ నుంచి కూడా మీ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. DigiLocker అధికారిక వెబ్‌సైట్ (https://digilocker.gov.in/)కి వెళ్లి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ (XXXXXXXXXX), 6-అంకెల సెక్యూరిటీ పిన్‌ (XXXXXX)ని ఉపయోగించి మీ అకౌంట్‌కు ‘Sign-in’ చేయండి.
2. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేసి, ‘Submit’పై Click చేయండి.
3. మీ ఆధార్ కార్డ్ ‘Issued Documents’ సెక్షన్‌లో ఉంటుంది.
4. మీ ఆధార్ కార్డ్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ‘Save’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
5. మీ పాస్‌వర్డ్-ప్రొటెక్షన్ ఇ-ఆధార్ కార్డ్‌ని ఓపెన్ చేయడానికి మీ పేరులోని మొదటి 4 అక్షరాలను, మీ పుట్టిన సంవత్సరాన్ని (YYYY ఫార్మాట్‌లో) ఎంటర్ చేయండి.

ఉమాంగ్ యాప్‌(UMANG App)ని ఉపయోగించి ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
మీ ఆధార్ కార్డును UMANG లేదా న్యూ-ఏజ్ గవర్నెన్స్ కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్, వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. అందులో ఆధార్ ఒకటిగా చెప్పవచ్చు. UMANG యాప్ ద్వారా మీ ఇ-ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ సులభమైన ప్రక్రియను పాటించండి.

How to Download Aadhaar Card

1. మీ మొబైల్ (iOS లేదా Android)లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
2. మీరు యాప్ దిగువన ‘All Services’ ట్యాబ్‌ని చూస్తారు. దానిపై క్లిక్ చేసి, టాప్-మోస్ట్ సెర్చ్ సెక్షన్ ద్వారా ‘My Aadhaar‘ కోసం సెర్చ్ చేయండి.
3. ‘Download Aadhaar’ అనే 4వ ట్యాబ్‌కు స్క్రోల్ చేయండి.
4. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
5. ‘Send OTP’పై క్లిక్ చేయండి. ఆ వన్-టైమ్ పాస్‌వర్డ్‌ని టైప్ చేసి లాగిన్ చేయండి. వెరిఫై చేసిన తర్వాత, మీ ఆధార్ కార్డ్‌ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
6. ‘Do you want a masked Aadhaar’ ఆప్షన్ ఎంచుకుని, ‘Download’ క్లిక్ చేయండి.
7. పాస్‌వర్డ్-ప్రొటెక్షన్ PDFలో మీ ఇ-ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. మీ ఆధార్‌ని వీక్షించడానికి పాస్‌వర్డ్ క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, YYYY ఫార్మాట్‌లో మీ పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. అంతే.. మీ ఆధార్ కార్డు వివరాలను చూడవచ్చు.

Read Also : Aadhaar Card Lock : మీ ఆధార్ కార్డు పోయిందా? మీ కార్డును వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

ట్రెండింగ్ వార్తలు