masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వండి
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్‌డ్ ఆధార్ కార్డ్.

Masked Aadhaar Card
masked Aadhaar card: ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్‌డ్ ఆధార్ కార్డ్. సాధారణంగా ఆధార్ కార్డులో పన్నెండు నెబర్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే మాస్క్‌డ్ ఆధార్‌లో పన్నెండు అంకెలు కనిపించవు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?
ఎనిమిది అంకెలు కనిపించకుండా ఉండే ఆధార్ కార్డే మాస్క్‌డ్ ఆధార్. దీనికోసం వినియోగదారులు మిగతా ఎనిమిది నెంబర్లు కనిపించకుండా చెరిపెయ్యనక్కర్లేదు. ఎనిమిది నెంబర్లు కనిపించకుండా ఉండే మాస్క్‌డ్ ఆధార్‌ను నేరుగా యూఏడీఏఐ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ వెబ్‌సైట్‌లో ‘డు యు వాంట్ ఎ మాస్క్‌డ్ ఆధార్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి, మాస్క్‌డ్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇకపై ఏ వ్యక్తులకైనా, సంస్థలకైనా ఆధార్ ఇవ్వాలనుకుంటే మాస్క్‌డ్ ఆధార్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఎందుకంటే పన్నెండు అంకెలు కనిపించేలా ఉండే ఆధార్ కార్డులు దుర్వినియోగం అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఆధార్ కార్డును అన్ని సంస్థలకు ఇవ్వొద్దని కేంద్రం చెప్పింది.
J. P. Nadda: జేపీ నద్దా ఏపీ పర్యాటన ఖరారు
అలాగే పబ్లిక్ కంప్యూటర్ ఉపయోగించి ఇ-ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటే, కంప్యూటర్ నుంచి పూర్తిగా ఆ కాపీలను డిలీట్ చేయాలని సూచించింది. ఎమ్ ఆధార్ యాప్ ద్వారా కూడా కావాల్సిన కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని లైసెన్స్‌డ్ సంస్థలు మాత్రమే ఆధార్ డౌన్లోడ్ చేయొచ్చని, అనుమతి లేని సంస్థలు ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేసినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, సేకరించినా చట్ట ప్రకారం నేరమేనని కేంద్రం వివరించింది.