Aadhaar Card : వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar Card : మీ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారా ఇలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.

Aadhaar Card

Aadhaar Card : దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటి. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, అనేక ఇతర రోజువారీ పనులకు ఆధార్ కార్డు చాలా (Aadhaar Card) అవసరం. సాధారణంగా ఆధార్‌ను UIDAI పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారు.

కానీ, ఇప్పుడు మీ వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా కూడా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ఏదైనా ఇతర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆధార్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితమైన మార్గంలో పొందవచ్చు.

వాట్సాప్ నుంచి ఆధార్ డౌన్‌లోడ్ కోసం ఇలా చేయండి :
మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్ డిజిలాకర్ అకౌంట్ (మీకు ఒకటి లేకపోతే, డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో క్రియేట్ చేయండి)
MyGov హెల్ప్‌డెస్క్ అధికారిక వాట్సాప్ నంబర్ : +91-9013151515 ( మీ ఫోన్‌లో సేవ్ చేయండి)

Read Also : Amazon Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై టాప్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!

వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :

  • మీ ఫోన్‌లో +91-9013151515 “MyGov Helpdesk”గా సేవ్ చేసుకోండి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్‌తో చాట్ ఎనేబుల్ చేయండి.
  • చాట్‌లో “Namaste” లేదా “Hi” అని రాయండి.
  • ఆప్షన్ల నుంచి “DigiLocker Services” ఎంచుకోండి.
  • మీకు DigiLocker అకౌంట్ ఉందా అని అడుగుతారు.
  • లేకుంటే ముందుగా DigiLockerలో అకౌంట్ క్రియేట్ చేయండి.
  • ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని చాట్‌లో ఎంటర్ చేయండి.
  • వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత చాట్‌బాట్ DigiLockerలో ఉన్న అన్ని డాక్యుమెంట్లను మీకు చూపుతుంది.
  • జాబితా నుంచి ఆధార్‌ను ఎంచుకోవడానికి నంబర్‌ను టైప్ చేయండి.
  • కొన్ని సెకన్లలోపు, మీ ఆధార్ కార్డ్ వాట్సాప్ చాట్‌లో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.