Smart Ration Card : స్మార్ట్ రేషన్ కార్డులో పేరు తప్పుగా వచ్చిందా? మీ ఫోన్‌లోనే ఇలా మార్చేయండి!

Telangana Smart Ration Card Download : తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులో పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా? T-Ration యాప్ ద్వారా వివరాలను ఎలా చెక్ చేయాలి, సవరించాలి, స్మార్ట్ రేషన్ కార్డును మొబైల్‌లో PDFగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Telangana Smart Ration Card

  • రేషన్ కార్డు చేతిలో ఉందా? మొబైల్‌తోనే PDF డౌన్‌లోడ్ చేసుకోండి
  • ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. T-Ration యాప్‌తో స్మార్ట్ కార్డు
  • స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులుంటే టెన్షన్ వద్దు.. ఫోన్‌లోనే చెక్, డౌన్‌లోడ్

Telangana Smart Ration Card Download : మీకు రేషన్ కార్డు ఉందా? తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు కార్డులు అందగా, కొందరికి మాత్రం కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. దాంతో రేషన్ కార్డుదారులకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

మీ రేషన్ కార్డులో కూడా ఏమైనా తప్పులు ఉంటే మొబైల్‌ ద్వారా వివరాలను చెక్ చేసుకుని సరిచేసుకోవచ్చు. మీరు ముందుగా మీ మొబైల్ ఫోన్లలో T-Ration యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. తద్వారా స్మార్ట్ రేషన్ కార్డు వివరాలను చెక్ చేయొచ్చు. రేషన్ కార్డులో తప్పులను వెంటనే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. ఆపై డిజిటల్ కార్డును PDFగా పొందవచ్చు.

స్మార్ట్ రేషన్ కార్డు అప్‌డేట్ :
తెలంగాణలో రేషన్ కార్డు అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమైన డాక్యుమెంట్.. కొత్త ఫ్యామిలీలు, వివాహం తర్వాత కుటుంబాలు, అర్హత కలిగిన ఇతర కుటుంబాలకు రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కూడా కొనసాగుతోంది.

అయితే, ఫిజికల్ స్మార్ట్ రేషన్ కార్డు చేతికి వచ్చిన తర్వాత అందులోని కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. పేరు లేదా వివరాల్లో పొరపాటు ఉంటే సంబంధిత ఆన్‌లైన్ సదుపాయం ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు.

Read Also : Flipkart Big Billion Days : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17, ఐఫోన్ 15 ధరలు భారీగా తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు ఇవే!

డిజిటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ :
టీ-రేషన్ యాప్‌లో స్మార్ట్ కార్డును స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది. అక్కడ కార్డుకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. తప్పుగా ఉన్న సమాచారం కనిపిస్తే, అందుబాటులో ఉన్న ఎడిట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసి సబ్మిట్ చేయవచ్చు. వివరాలు సరిచూసుకున్న తర్వాత డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డును PDF రూపంలో ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో ఆ PDFను చూపించవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

స్మార్ట్ రేషన్ కార్డును మొబైల్లో ఎలా డౌన్ లోడ్ చేయాలి?

  • ముందుగా (Google Play Store)లో (T-Ration) యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • యాప్‌ను ఓపెన్ చేయగానే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్‌కు వచ్చిన OTPతో లాగిన్ అవ్వండి.
  • హోమ్ స్క్రీన్‌లో కనిపించే (Scan Smart RC) ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ ఫిజికల్ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయండి.
  • డిజిటల్ వెరిఫికేషన్ ఆఫ్ స్మార్ట్ కార్డు కేటగిరీలో మీ వివరాలను చెక్ చేయండి.
  • మీ పేరు లేదా ఇతర సమాచారంలో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో చూడండి
  • యాప్ లో కనిపించే సవరణ ఆప్షన్ ద్వారా వివరాలను మార్చి సబ్మిట్ చేయండి.
  • చివరిగా Download ఐకాన్‌పై క్లిక్ చేసి స్మార్ట్ రేషన్ కార్డును PDFగా ఫోన్‌లో సేవ్ చేయొచ్చు.

Note : టి-రేషన్ యాప్‌లో కనిపించే ఆప్షన్లు లేదా సవరణ విధానం ప్రభుత్వం అందించే అప్‌డేట్లను బట్టి మారవచ్చు. ఓటీపీ, ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో షేర్ చేయొద్దు..