WhatsApp Tips And Tricks : వాట్సాప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోవచ్చు!

వాట్సాప్‌లో ఎవరైనా మీ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ చేశారని అనుమానంగా ఉందా? వాట్సాప్‌లో మీ నెంబర్ ఎవరూ బ్లాక్ చేశారో వెంటనే తెలిసిపోతుంది. అదేలా అంటారా? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.

WhatsApp Tips And Tricks: వాట్సాప్‌లో ఎవరైనా మీ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ చేశారని అనుమానంగా ఉందా? అయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. వాట్సాప్‌లో మీ నెంబర్ ఎవరూ బ్లాక్ చేశారో వెంటనే తెలిసిపోతుంది. అదేలా అంటారా? వాస్తవానికి వాట్సాప్ అకౌంట్లో ఎవరిని బ్లాక్ చేసినా తెలుసుకునేందుకు ఎలాంటి అఫీషియల్ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ, వాట్సాప్ టిప్స్, ట్రిక్స్ (WhatsApp Tips And Tricks) ద్వారా ఈజీగా బ్లాక్ చేసిన వారిని కనిపెట్టేయొచ్చు. ప్రముఖ ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ తమ ప్లాట్ ఫాంపై యూజర్ల కోసం కొన్ని టిప్స్, ట్రిక్స్ రివీల్ చేసింది. ఈ ట్రిక్స్ ను వాట్సాప్ (WhatsApp’s FAQ page) పేజీలో లిస్టు చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

Find out who blocked you on WhatsApp 
Tip-1 : వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో తెలియాలంటే.. వాట్సాప్ ఓపెన్ చేయగానే మీకు Last Seen First అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే.. ఈ ఆప్షన్ కనిపించదు. Last Seen అనే ఆప్షన్ కనిపిస్తే. మీ కాంటాక్ట్ బ్లాక్ చేయలేదని అర్థం.. లేదంటే.. మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారని భావించవచ్చు.

Tip-2 :
వాట్సాప్ అకౌంట్లో.. Online Status ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ స్టేటస్ చెక్ చేయడం ద్వారా మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే.. ఆన్‌లైన్‌లో ఉన్నారనే విషయం తెలియదు.. ఇలా కూడా ఈ కాంటాక్ట్ బ్లాక్ చేశారని భావించవచ్చు.

Tip-3 :
వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో (Profile Photo)ను ఓసారి చెక్ చేయండి.. వాట్సాప్ అకౌంట్లో ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫొటో మీకు కనిపించదు. అంటే.. మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారని అర్థం. అంతేకాదు.. తన ఫోన్ కాంటాక్ట్ లిస్టులో మీ ఫోన్ నెంబర్ డిలీట్ చేసినా కూడా ప్రొఫైల్ ఫొటో కనిపించదు. ఒకవేళ కాంటాక్ట్ సేవ్ అయి ఉంటేనే కనిపిస్తుంది. సాధారణంగా ప్రైవసీ దృష్ట్యా యూజర్లు తమ ప్రొఫైల్ ఫొటోను పబ్లిక్ కనిపించకుండా డిజేబుల్ చేసుకునే వీలుంది. అలా కూడా ప్రొఫైల్ ఫొటో (Profile Photo) కనిపించదు. అదే.. ఒకే గ్రూపులో ఉంటే మాత్రం అప్పుడు యూజర్ ప్రొఫైల్ ఫొటో కనిపించే అవకాశం ఉంది.

Tip-4 :
వాట్సాప్ లో మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారని తెలియాలంటే.. ఒకసారి యాప్ నుంచి వాయిస్ కాల్ చేసి చూడండి. ఒకవేళ మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే.. వాట్సాప్ కాల్ వెళ్లదు. అప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవచ్చు.

Tip 5:
మీ వాట్సాప్ అకౌంట్‌ నుంచి గ్రూపు క్రియేట్ చేసేందుకు ట్రై చేయండి. ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే వారి కాంటాక్ట్ నెంబర్ గ్రూపులో యాడ్ చేయలేరు. ఇలా కూడా మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారని గుర్తు పట్టవచ్చు.

Tip 6:
మీ వాట్సాప్ నుంచి ఎవరూ మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుమానిస్తున్నారో.. వారికి వాట్సాప్ మెసేజ్ చేసి చూడండి.. ఒకవేళ ఆ యూజర్ మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే.. మెసేజ్ డెలివరీ కాదు.. అలాగే.. సింగిల్ టిక్ మాత్రమే కనిపిస్తుంది. డబుల్ టిక్ కనిపిస్తే మీరు పంపిన మెసేజ్ డెలివరీ అయినట్టు అర్థం.. అలాగే టిక్ డబుల్ టిక్ కనిపిస్తే.. మెసేజ్ చదవారని అర్థం చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ ఎవరైనా బ్లాక్ చేశారని అనుమానంగా ఉంటే.. ఈ వాట్సాప్ టిప్స్, ట్రిక్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.. ఓసారి ట్రై చేయండి..

ట్రెండింగ్ వార్తలు