మీ 4G ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

How to get better 4G Signal : మీరు 4G ఫోన్ వాడుతున్నారా? ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంది? నెట్ స్పీడ్ విసిగిస్తోందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. 4G నెట్ వర్క్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా మీ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందని వర్రీ అయిపోతుంటారు.
ఇండియాలో 4G నెట్ వర్క్ గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ 4G నెట్ వర్క్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. డేటా సంచలనం రిలయన్న్ జియో, ఎయిర్ టెల్ 4G విస్తరణ తర్వాత మరింత వేగంగా విస్తరిస్తోంది.
సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది స్పెక్ట్రమ్ లిమిట్ ఆధారంగా వస్తుంది. 4G నెట్ వర్క్ సిగ్నల్ ఉన్నా కూడా ఫోన్లలో నెట్ స్పీడ్ తక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. 4G LTE connectivity కనెక్టవిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య అధికంగా పెరగడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కానీ, మీ ఫోన్లో 4G స్పీడ్ పెంచుకోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అయిపోండి చాలు..
4G స్పీడ్ కోసం పెంచుకోవాలంటే? :
* మీ ఫోన్ Settingsలోకి వెళ్లండి.
* మొబైల్ నెట్‌వర్క్ ‘4G’ ఆప్షన్ ఎంచుకోండి.. Enable చేయండి.
* Access Point Name (APN) ను చెక్ చేయండి.
* మీరు వాడే నెట్ వర్క్ APN సమాచారాన్ని ఎంచుకోండి.
* APNను Reset చేయండి.
* Settings- Mobile Network- Access Point పేర్లపై Click చేయండి.
* APNను Defaultకు రీసెట్ చేయడాన్ని ఎంచుకోండి.
* 4G ఇంటర్నెట్ స్పీడ్ మీ ఫోన్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.
* కొన్ని Apps ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిస్తాయి.
* మరింత డేటాను కంజ్యూమ్ చేసి.. మీ ఫోన్ స్పీడ్ తగ్గిస్తుంటాయి.
* Apps Auto Play ఆప్షన్ నిలిపివేయండి. మీ Bandwidth వినియోగాన్ని తగ్గిస్తుంది. డేటాను సేవ్ చేస్తుంది.
* 4G స్పీడ్ 5Mbps నుంచి 10Mbps వరకు మెరగువుతుంది.
ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. మీ ఫోన్ 4G ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోండి..