మీ ఫోన్‌‌పై పడిన scratches పోవాలంటే ఇలా చేయండి!

  • Publish Date - October 14, 2020 / 03:39 PM IST

remove phone scratches  : మీ ఫోన్ లేదా ఏదైనా వస్తువు చేతిలో నుంచి జేబులో నుంచి జారి కిందపడితే గీతలు పడుతుంటాయి.

మీరు వాడే ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్లపై స్ర్కీన్ పై గీతలు పడితే మొబైల్ డివైజ్ స్ర్కీన్ రిప్లేస్ చేసుకోవాలని చూస్తుంటారు.
మీ ఫోన్ స్ర్కీన్లపై పడిన గీతలను సురక్షితమైన పద్ధతిలో తొలగించుకోవచ్చు.

మీ ఫోన్ స్ర్కీన్‌పై పడిన గీతలను తొలగించాలంటే.. ఈ 9 సింపుల్ రిమెడీలు ఫాలో కావొచ్చు.

అది కూడా చిన్నపాటి గీతలు అయితే మార్చుకోవచ్చు..  ఫోన్ స్విచ్ఛాప్ చేయాలి. బ్యాటరీ కూడా రిమూవ్ చే్యాల్సి ఉంటుంది.

పోర్టుల మధ్య లిక్విడ్ వెళ్లకుండా సీల్ వేయాల్సి ఉంటుంది.

1. Toothpaste :
మీ ఫోన్ స్ర్కీన్ పై సన్నని గీతలు పడితే టూత్ పేస్ట్ ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు.

ఏదైనా దూది లేదా మెత్తని క్లాత్ తీసుకోండి.. దానిపై టూత్ పెస్ట్ అప్లయ్ చేయండి.

ఫోన్ స్ర్కీన్‍పై క్లీన్ చేయండి. స్ర్కీన్‌పై పడిన స్ర్కాచ్ పోయేంతవరకు అలానే రుద్దుతూ ఉండాలి.

కొంచెం తడిచేసిన క్లాత్ తో టూత్ పేస్ట్ ను తొలగించాలి.
2. Sandpaper or drill grinders :
ఫోన్ స్ర్కీన్లపై మొండి మరకలు లేదా గీతలను తొలగించేందుకు శాండ్ పేపర్ లేదా డ్రిల్ గ్రైండర్లు అద్భుత పరిష్కారంగా చెప్పవచ్చు.

ఫోన్ స్ర్కీన్ పై ఈ రెమిడీ సరైనది కాదు.

మీ ఫోన్ వెనుకవైపు పడిన గీతలు లేదా మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.

శాండ్ పేపర్ వాడేటప్పుడు జాగ్రత్తగా రుద్దాలి.

ఫోన్ స్ర్కాచ్లపై రుద్దేటప్పుడు ఫోన్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువగా రుద్దితే లేని స్ర్కీన్ పాడైపోయే అవకాశం ఉంటుంది..

3. Magic Erasers
ఫోన్ స్ర్కీన్లపై పడిన సన్నని గీతలను తొలగించేందుకు మ్యాజిక్ ఎరేజర్లను వాడొచ్చు.

తడిగా ఉన్న శాండ్ పేపర్ మాదిరిగానే ఈ మ్యాజిక్ ఎరేజర్లు కూడా పనిచేస్తాయి.

కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

4. Baking soda :
ఫోన్లపై పడిన గీతలను బేకింగ్ సోడాతో తొలగించుకోవచ్చు.

ఈ మెథడ్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ఈ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.

రెండు వంతుల బేకింగ్ సోడాను ఒక వంతు నీళ్లలో కలపండి.

ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోయండి.
అది పేస్టులా మారి నురువు వచ్చేంతవరకు కలియబెట్టండి.

ఒక సుతిమెత్తని క్లాత్ ను ఇందులో తడిపి గీతలు పడిన చోట స్ర్కీన్ పై మెల్లగా రుద్దండి.

5. Baby powder :
బేబీ పౌడర్ తీసుకోండి. కొంచెం నీళ్లు కలపండి.

పేస్టులా మారిన ద్రావణాన్ని మీ ఫోన్ స్ర్కీన్‌పై మెల్లగా రుద్దండి.

నీళ్లు ఎక్కువగా వాడొద్దు. లేదంటే మీ ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

6. Vegetable oil :
మీ ఫోన్ స్ర్కీన్‌పై కనిపించని గీతలు లేదా ఉన్నాయా?

అయితే వెజిటేబుల్ ఆయిల్ ఒక తాత్కాలిక పరిష్కారంగా చెప్పవచ్చు.

ఒక చుక్క వెజిటేబుల్ ఆయిల్ ను స్ర్కాచ్ పడిన చోట వేసి మెల్లగా మసాజ్ చేసినట్టుగా చేస్తే చాలు.

కనిపించని సన్నని గీతలు కూడా వెంటనే మాయమైపోతాయి.

7. Egg and potassium aluminum sulfate
ఫోన్ స్ర్కీన్లపై పడిన కొన్ని సన్నని గీతలను తొలగించాలంటే గుడ్డులోని తెల్ల సొన కలిపాలి.

పోటాషియం అల్యూమినయం సల్ఫేట్ ద్రావణాన్ని మిక్స్ చేయండి.

మైక్రోఫైబర్ క్లాత్, గుడ్డు కలిపిన ద్రవణంతో ఫోన్ స్ర్కీన్ పై పడిన గీతలను వెంటనే తొలగించవచ్చు.

* ఒక గుడ్డులోని తెల్లసొన.. ఒక టీ స్పూన్ అల్యూమినయం ఫోయిల్ తీసుకోండి.

150 డిగ్రీల ఫారన్ హీట్ వరకు వేడి చేయండి.

* గుడ్డు, అల్యూమినయం ద్రావణంలో మైక్రోఫైబర్ క్లాత్ ను ముంచండి.

* ద్రావణం ముంచిన క్లాత్‌ను తీసి చల్లని నీటిలో 20 నుంచి 30 సెకన్ల వరకు అలానే ఉంచండి.

* పై విధంగా మూడు సార్లు అలానే చేయండి. ఆ తర్వాత క్లాత్ తీసేసి 48 గంటల పాటు గాల్లో ఆరబెట్టండి.

* ఇప్పుడు.. ఆ క్లాత్ ను ఫోన్ స్ర్కీన్లపై పడిన గీతలను తొలగించవచ్చు.

8. Car scratch removal creams :
కార్లకు వాడే స్ర్కాచ్ రిమూవల్ క్రీములలో Turtle Wax, 3M Scratch, Swirl Remover ద్వారా ఫోన్ స్ర్కీన్లపై పడిన గీతలను కూడా వెంటనే తొలగించవచ్చు.

క్రీమ్ అప్లయ్ చేసి మెత్తని క్లాత్ తో మెల్లగా రుద్దాలి.

9. Brasso, Silvo polishes :
ఈ విధానంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ పాలీష్ లతో సులభంగా ఫోన్ స్ర్కీన్లపై పడిన గీతలను తొలగించుకోవచ్చు.

Brasso, Silvo పాలీష్ ఎక్కువగా వాడితే కొన్నిసార్లు మీ ఫోన్ స్ర్కీన్ పై ఉండే కోటింగ్ కూడా పోతుంది.

దాంతో మరిన్ని గీతలు పడే అవకాశం ఉంది..

* ఒక గిన్నెలో పాలీష్‌ను పోయండి.

* ఏదైనా టవల్ ను గిన్నెలో కిందిభాగంలో ఉంచండి.

* మెత్తని క్లాత్ ను పాలీష్ లో ముంచండి.

* వృత్తాకర పద్ధతిలో క్లాత్ ను పైకి కిందికి స్ర్కాచ్ ఉన్నచోట మెల్లగా రుద్దుతూ ఉండాలి.

* ఆ తర్వాత మరో కొత్త క్లాత్ తీసుకుని మరోసారి స్ర్కీన్ పై రుద్దండి..

ట్రెండింగ్ వార్తలు