WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్లు కాల్స్ షెడ్యూల్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!

WhatsApp Schedule Calls : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో మీటింగ్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లోని సభ్యులందరూ షెడ్యూల్ చేసిన సమయంలో కాల్‌లో చేరేందుకు నోటిఫికేషన్ అందుకుంటారు.

How to schedule calls on WhatsApp

WhatsApp Schedule Calls : ప్రస్తుత రోజుల్లో ఫిజికల్ మీటింగ్స్ కన్నా వర్చువల్ మీటింగ్స్ సర్వసాధారణంగా మారాయి. ప్రతిఒక్కరూ ఆఫీసులో కాకుండా వర్చువల్ మీటింగ్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్‌గా మీరు వర్చువల్ మీటింగ్స్ సెటప్ చేయాలనుకుంటున్నారా? అయితే, వాట్సాప్ కాల్స్ ద్వారా మీ ఈవెంట్స్ టైమ్ సెట్ చేసుకోవచ్చు.

వాట్సాప్, చాలా మంది యూజర్ల ఫోన్‌లలో గో-టు యాప్, షెడ్యూల్‌ను సులభతరం చేసే “ఈవెంట్స్” అనే ఫీచర్‌ని కలిగి ఉంది. ఈ ఫీచర్ మీరు వాట్సాప్‌లో నేరుగా కాల్స్ షెడ్యూల్ చేసేందుకు అనుమతిస్తుంది. మల్టీ యాప్‌లపై ఆధారపడకుండా వర్చువల్ మీటింగ్స్ సెటప్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో కాల్స్ ఎలా షెడ్యూల్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో కాల్స్ ఎలా షెడ్యూల్ చేయాలి? :

  • మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • మీరు కాల్ షెడ్యూల్ చేయాలనుకునే గ్రూపునకు వెళ్లండి.
  • మెసేజ్ బార్‌లోని పేపర్‌క్లిప్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. “ఈవెంట్” క్లిక్ చేయండి.
  • ఇప్పుడు “ఈవెంట్‌ క్రియేట్” ఆప్షన్ ఎంచుకోండి.
  • ఈవెంట్ పేరును ఎంటర్ చేయండి. తేదీ, టైమ్ సెట్ చేయండి.
  • మీరు మీటింగ్‌ని లింక్ ద్వారా మేనేజ్ చేయాలనుకునే టోగుల్‌ని ఆన్ చేసి, “Send” ఐకాన్ ట్యాప్ చేయండి.

మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, జూమ్ మీటింగ్ రూమ్స్ కోసం ఎక్స్‌ట్రనల్ లింక్‌లను క్రియేట్ చేసేందుకు లాంగ్ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు, మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో మీటింగ్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లోని సభ్యులందరూ షెడ్యూల్ చేసిన సమయంలో కాల్‌లో చేరేందుకు నోటిఫికేషన్ అందుకుంటారు.

ఈ వాట్సాప్ ఫీచర్ “ఈవెంట్” గ్రూపులలో మెసేజ్ షెడ్యూల్ చేసేందుకు మాత్రమే అందుబాటులో ఉంది. మీ కాంటాక్టులను షెడ్యూల్ చేయలేరు. కానీ, చింతించకండి, “కాల్ లింక్” అని పిలిచే ఒక ప్రత్యామ్నాయ ఫీచర్ ఉంది. కాల్ లింక్‌ని క్రియేట్ చేసి మీ కాంటాక్టులకు పంపడానికి యూజర్లను అనుమతిస్తుంది.

తెలియాల్సిన ముఖ్య విషయాలు :
ఏదైనా ఈవెంట్‌ను షెడ్యూల్ చేస్తున్నప్పుడు.. ఈవెంట్ వివరణను రాయడం, ఈవెంట్‌కు ఎండ్ టైమ్, ఈవెంట్ లొకేషన్ అప్‌డేట్ చేసేందుకు వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది. ఏ సమావేశంలోనైనా మీ ప్రెజెంటేషన్‌ను సులభంగా మీ స్క్రీన్‌ను షేర్ చేసేందుకు వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది. మీరు ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, మ్యాక్, విండోస్‌లో ఉపయోగించవచ్చు.

Read Also : WhatsApp Video Call : వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్.. వీడియో కాలింగ్ ఫీచర్లు, ఫన్ ఎఫెక్ట్స్, మరెన్నో ఫీచర్లు..!