WhatsApp Video Call : వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్.. వీడియో కాలింగ్ ఫీచర్లు, ఫన్ ఎఫెక్ట్స్, మరెన్నో ఫీచర్లు..!

WhatsApp Video Calls : మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు, డెస్క్‌టాప్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి వాట్సాప్ అనేక కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తోంది.

WhatsApp Video Call : వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్.. వీడియో కాలింగ్ ఫీచర్లు, ఫన్ ఎఫెక్ట్స్, మరెన్నో ఫీచర్లు..!

WhatsApp rolling out new updates to video call feature

Updated On : December 13, 2024 / 6:19 PM IST

WhatsApp Video Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌లు పంపడానికి లేదా వీడియో కాల్స్ చేయడానికి వాట్సాప్‌ని ఉపయోగించని వారు ఉండరు. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రోజుకు 2 బిలియన్లకు పైగా కాల్స్ చేస్తుంటారు.

ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. రాబోయే హాలిడే సీజన్‌ కోసం వాట్సాప్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు, డెస్క్‌టాప్‌లలో కొత్త అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ల సాయంతో వినియోగదారులు తమ కుటుంబం, స్నేహితులతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు, డెస్క్‌టాప్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి వాట్సాప్ అనేక కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తోంది. వినియోగదారులు వీడియో కాల్స్ సమయంలో అనేక కొత్త ఎఫెక్ట్స్ కూడా ఎంచుకోవచ్చు. ఈ అప్‌డేట్‌లో గ్రూప్ చాట్‌లోని కాల్‌లో నిర్దిష్ట సభ్యుడిని ఎంచుకోవడానికి ఆప్షన్ కూడా పొందవచ్చు.

వాట్సాప్‌లో 10 సరికొత్త ఎఫెక్ట్స్ :
వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్‌లో మీరు గ్రూప్ కాల్ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. ఇంతకు ముందు గ్రూప్ కాల్ చేస్తున్నప్పుడు గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా జాయిన్ అయ్యేవాళ్లు కానీ, ఇప్పుడు కాల్ చేసేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్లను మాత్రమే ఎంచుకోవచ్చు. వీడియో కాల్స్ కోసం వాట్సాప్ ఫన్ ఎఫెక్ట్‌లను కూడా చేర్చింది. వాట్సాప్‌తో వీడియో కాల్ చేస్తున్నప్పుడు 10 ఫన్ ఎఫెక్ట్‌లను ఎంచుకోవచ్చు.

డెస్క్‌టాప్ నుంచి వీడియో కాలింగ్ :
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వీడియో కాల్స్ బాగా మెరుగుపరిచింది. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లోని కాల్స్ ట్యాబ్‌కు అనేక ఆప్షన్లను చేర్చింది. ఇప్పుడు ఎవరైనా కాల్ ట్యాబ్‌ని ఓపెన్ చేస్తే.. మీరు కాల్స్ ఎనేబుల్ చేయడం, కాల్ లింక్‌ని క్రియేట్ చేయడం లేదా నంబర్‌ను నేరుగా డయల్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు డెస్క్‌టాప్‌లను ఉపయోగించే వ్యక్తులకు వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు మీకు హై-రిజల్యూషన్ వీడియో కాలింగ్ సపోర్టు కూడా అందిస్తుంది. తద్వారా మీరు గుడ్ క్వాలిటీతో ప్రైవేట్, గ్రూప్ కాల్స్ చేయవచ్చు.

Read Also : Redmi Note 14 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, ఆఫర్లు!