Schedule WhatsApp Calls : వారెవ్వా.. కిర్రాక్ ఫీచర్.. ఇక వాట్సాప్ కాల్స్ కూడా షెడ్యూల్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Schedule WhatsApp Calls : వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. ఒకరే కాదు.. గ్రూపు సభ్యులకు ఎవరికైనా ఈజీగా వాట్సాప్ కాల్ షెడ్యూల్ చేయొచ్చు..

Schedule WhatsApp Calls

Schedule WhatsApp Calls : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కాలింగ్ ఫీచర్ కోసం బిగ్ అప్‌డేట్‌ (Schedule WhatsApp Calls) రిలీజ్ చేసింది. మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు. ఫ్యామిలీతో చాట్ అయినా లేదా వర్క్ అయినా ఏదైనా సరే మీరు టైమ్ సెట్ చేయవచ్చు. అందరిని ఇన్వైట్ చేయొచ్చు. కాల్ ప్రారంభమయ్యే ముందు వాట్సాప్ అందరి సభ్యులకు అలర్ట్ చేస్తుంది.

వాట్సాప్ షెడ్యూల్ కాల్స్ ఇలా :
షెడ్యూల్డ్ కాల్స్ : గ్రూప్ కాల్స్‌ ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరు లేదా మొత్తం గ్రూపులను ఇన్వైట్ చేయొచ్చు. ముందుగానే వారందరికీ నోటిఫికేషన్ వస్తుంది.
కొత్త ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ : కొత్త ఇన్-కాల్ టూల్స్ ఎమోజీలతో కనెక్ట్ అవ్వొచ్చు.
కాల్ మేనేజ్‌మెంట్ : కాల్స్ ట్యాబ్ ఇప్పుడు షెడ్యూల్ కాల్ ఎవరు జాయిన్ అవుతారో చూపిస్తుంది. ఇన్వైట్ లింక్‌లను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎవరైనా లింక్ ద్వారా చేరినప్పుడు కాల్ క్రియేటర్లు కూడా అలర్ట్స్ పొందుతారు.

Read Also : Google Pixel 9a : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9aపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!

వాట్సాప్ అన్ని కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో అందరి వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీరు కొత్త ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయాలంటే? :

వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా..

  • వాట్సాప్ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్‌కి వెళ్లండి.
  • కాల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  • కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఎంచుకోండి.
  • షెడ్యూల్ కాల్ ఆప్షన్ ఎంచుకోండి.
  • డేట్, టైమ్ సెట్ చేయండి.
  • వీడియో కాల్ లేదా ఆడియో కాల్ ఏది కావాలో ఎంచుకోండి.
  • గ్రీన్ బటన్‌ను ట్యాప్ చేయండి.

ఇప్పుడు, మీ వాట్సాప్ షెడ్యూల్ కాల్ రాబోయే కాల్స్ లిస్టులో కనిపిస్తుంది. ముందుగా వాట్సాప్ కాల్స్ జాయిన్ అయ్యే వారందరికీ రిమైండర్‌ను పంపుతుంది.