New Mobile Setup Guide : కొత్త ఫోన్ కొన్నారా? మొబైల్ సెటప్‌లో ఈ మిస్టేక్స్ చేస్తే.. మీ ఫోన్ పని ఖతమే.. డేటాకే డేంజర్!

New Mobile Setup Guide : కొత్త ఫోన్‌ సెటప్ చేసేటప్పుడు మీరు నివారించాల్సిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్ల వల్ల మీరు ముఖ్యమైన డేటాను కోల్పోవచ్చు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

New Mobile Setup Guide

  • కొత్త ఫోన్ కొన్నాక సెటప్ సరిగా చేయకపోతే జరిగేది ఇదే
  • పాత్ ఫోన్ డేటా పూర్తిగా ట్రాన్స్‌ఫర్ చేశాకే పడేయండి
  • సెటప్ సరిగ్గా చేయకపోతే కొత్త ఫోన్ కూడా పాతదవుతుంది
  • ఫోన్ సెటప్ సరిగా ఎలా చేయాలో సింపుల్ గైడ్ మీకోసం

New Mobile Setup Guide : కొత్త ఫోన్ కొన్నారా? పాత ఫోన్ ఏం చేశారు? కొత్త ఫోన్ కొన్నాం కదా అని పాత ఫోన్ పడేశారా? ఎప్పుడూ కూడా అలా అసలు చేయొద్దు. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే.. పాత ఫోన్ అవసరం పడొచ్చు.

కొన్నిసార్లు కొత్త ఫోన్ సెట్ చేసే సమయంలో పాత్ ఫోన్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. ఇది చాలా కామన్.. అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది.

మీ పాత డేటా మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేయలేకపోవచ్చు. కొత్త ఫోన్ కొన్న వెంటనే అన్ని ఒకేసారి  (New Mobile Setup Guide) సెటప్ చేయలేకపోవచ్చు. అప్పటివరకూ పాత ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి.

ఏదైనా డేటా మిస్ అయినా తిరిగి పొందడానికి ఈ పాత ఫోన్ అవసరం పడుతుంది. మీ పూర్తి డేటాను పాత్ ఫోన్‌ నుంచి కొత్త ఫోన్ లోకి జాగ్రత్తగా సెటప్ చేసుకోండి. కొత్త ఫోన్ కొన్నాక సెటప్ చేసేటప్పుడు ఏయే పొరపాట్లను నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Suzuki Swift Hydrogen : పెట్రోల్ కాదు, ఈవీ కాదు.. ఇకపై హైడ్రోజన్ కార్లు! మారుతి స్విఫ్ట్ కొత్త ఫ్యూచర్ టెక్నాలజీ ఇదే!

సేఫ్టీ ఫీచర్లను విస్మరించొద్దు :
కొత్త ఫోన్ కొన్న తర్వాత చాలా మంది కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోరు. ఇందులో సేఫ్టీకి సంబంధించిన సెట్టింగ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు యూజర్ డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తున్నాయి. సేఫ్టీ సెట్టింగ్‌లపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం.

మీ ఫోన్‌ను సెటప్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్‌లను విస్మరించవద్దు. కొత్త ఫోన్ కొన్న వెంటనే గూగుల్ ప్లే ప్రొటెక్ట్, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, బయోమెట్రిక్ ప్రొటెక్షన్ లొకేషన్ ట్రాకింగ్ వంటి సెట్టింగ్‌లను మీకు నచ్చినట్లుగా సెట్ చేసుకోండి.

అన్ని యాప్‌లను ఒకేసారి ఇన్‌స్టాల్ చేయొద్దు :
చాలా మంది కొత్త ఫోన్ కొన్న తర్వాత తమ పాత ఫోన్‌లోని యాప్‌లన్నింటినీ ఒకేసారి ఇన్‌స్టాల్ చేసుకుంటారు. భవిష్యత్తులో అవసరం పడొచ్చని భావించి వాటి అవసరం లేకపోయినా ఇలా చేస్తారు. దీని కారణంగా రెండు నష్టాలు ఉన్నాయి. మొదటిది.. మీరు కొత్త ఫోన్ కొన్న వెంటనే దాని స్టోరేజ్‌ను నింపేస్తున్నారు.

తద్వారా మీ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్‌ తగ్గుతుంది. రెండోది.. మోడ్రాన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పుడు థర్డ్-పార్టీ యాప్‌లతో పనిలేదు. అన్ని ఫీచర్లు ఉంటున్నాయి. మీ కొత్త ఫోన్‌లోకి అనవసరమైన యాప్‌లను లోడ్ చేసి అనవసరంగా స్టోరేజీ వృథా చేయకపోవడమే బెటర్.

అన్ని అనుమతులను ఆన్ చేయండి :
కొత్త ఫోన్ వాడే ఉత్సాహంలో చాలామంది కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ మర్చిపోతుంటారు. తొందరపడి అన్ని అనుమతులను ఇస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం కొన్ని అనుమతులు అవసరం.

కానీ, అన్ని అనుమతులను ఇవ్వడం ద్వారా అనవసరమైన యాప్‌లు కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు అనుమతించినట్టే. అందుకే మీ అనుమతులను రివ్యూ చేయండి. అనవసరమైన వాటిని వెంటనే (Not Allowed) ఆపేయండి.

మీ పాత ఫోన్‌ పారేయొద్దు :
కొంతమంది కొత్త ఫోన్ కొన్న వెంటనే తమ పాత ఫోన్‌కు పక్కన పడేస్తుంటారు. ఇలా అసలు చేయొద్దు. కొన్నిసార్లు, పాత ఫోన్ నుంచి మొత్తం డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో అవసరమైనప్పుడు మీ పాత ఫోన్ ఉపయోగపడుతుంది.