Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

Third-Party Apps Access Google Account : మీ గూగుల్ అకౌంట్ థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ అయిందా? ఓసారి చెక్ చేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్ కు థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపివేయాలి.

Third-Party Apps Access Google Account : మీ గూగుల్ అకౌంట్ థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ అయిందా? ఓసారి చెక్ చేసుకోండి. డిజిటల్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ డిజిటల్ డివైజ్ లతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్ట్ కాకుండా రోజు గడవని పరిస్థితి.. గూగుల్ అకౌంట్ ద్వారానే ప్రతి డేటాను యాక్సస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్లతో ఇంటరాక్ట్ అవుతుంటాయి. వెబ్‌సైట్ ద్వారా డేటాను యాక్సస్ చేసుకోవడం జరుగుతుంది. వీటిన్నింటికి కావాల్సింది ఒకటే గూగుల్ జీమెయిల్ అకౌంట్. దీనిద్వారానే మనకు అవసరమైన డేటాను యాక్సస్ చేసుకుంటుంటాం.

ఏదో ఒక అప్లికేషన్ కు గూగుల్ అకౌంట్ యాక్సస్ ఇవ్వాల్సిన పరిస్థితి.. లేదంటే ఆ సర్వీసు యాక్సస్ చేయడం కుదరదు. ఇదే సైబర్ నేరగాళ్లకు లూప్ హోల్ గా మారింది. ఫలితంగా గూగుల్ అకౌంట్ హ్యాకింగ్ చేసి యూజర్ల విలువైన డేటాను తస్కరిస్తుంటారు. హ్యాకర్లు యూజర్ల డేటాను దొంగిలించేందుకు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు.

థర్డ్ పార్టీ యాప్స్ హ్యాకర్లకు పోర్టల్ పనిచేస్తాయి. అందుకే గూగుల్ అకౌంట్ సెక్యూర్ గా ఉండాలంటే తప్పనిసరిగా మీ జీమెయిల్ అకౌంట్ కు థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపివేయాలి. ఇంతకీ మీ గూగుల్ అకౌంటుకు అనుసంధానమైన థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps) యాక్సస్ ఎలా ఆపివేయాలో ఓసారి చూద్దాం.. స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వంటి డివైజ్ ల్లో ఎలా థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపివేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కింది విధంగా ఫాలో అయితే చాలు.

Mobile :
* మీ Android స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్ చేసి.. Settings లోకి వెళ్లండి.
* Settingsపై నొక్కిన తర్వాత, లాగిన్ అయిన Gmail అకౌంట్ కనిపిస్తుంది.
* మీ Google అకౌంట్ Manage బటన్ నొక్కండి.
* ఇక్కడ మీకు మరో స్ర్కీన్ రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
* స్వైప్ చేసి.. ‘Security’ ఆప్షన్ ఎంచుకోండి.
* మీ అకౌంట్ యాక్సెస్‌తో థర్డ్-పార్టీ యాప్స్ కనిపిస్తాయి.
* కొంచెం స్క్రోల్ చేసి ఏ థర్డ్ పార్టీ యాప్ యాక్సస్ అయిందో దాని ఆప్షన్ నొక్కండి.
* మీ Google అకౌంట్ ఏ యాప్‌కి యాక్సెస్ ఉందో చూడొచ్చు.
* ఆ యాప్‌ను సెక్యూరిటీ అయితే పర్వాలేదు.. లేదంటే యాప్‌ని ఎంచుకుని Access Removeపై నొక్కండి.
Read Also :  Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ :
* మీ Google అకౌంట్లోకి లాగిన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న అకౌంట్ సింబల్‌పై క్లిక్ చేయండి.
* మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. మీ Google Manage ఎంచుకోండి.
* Security ఆప్షన్ ఎంచుకోండి.
‘మొబైల్’ మాదిరిగా థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ తొలగించండి.

గమనిక: మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయితేనే ఈ రెండు విధానాలు పనిచేస్తాయి. మీ మొబైల్ డేటాను ఆన్ చేయడం లేదా సెక్యూర్ Wi-Fi కనెక్షన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

Read Also :  Martin Guptill : వామ్మో.. బ్యాటింగ్ చేశాక 4.4 కిలోలు బరువు తగ్గాడు

ట్రెండింగ్ వార్తలు