Samsung Phones High Risk : శాంసంగ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే అప్‌‌డేట్ చేసుకోండి..!

Samsung Phones High Risk : శాంసంగ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు భారత ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని భద్రతపరమైన లోపాలకు సంబంధించి యూజర్లను హెచ్చరిస్తోంది. వెంటనే ఫోన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Indian govt issues high risk warning against Samsung Galaxy S23 and other users

Samsung Phones High Risk : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. శాంసంగ్ కొన్ని ఫోన్లలో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) ద్వారా శాంసంగ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. ఈ హెచ్చరిక ప్రకారం.. సీఈఆర్‌టీ ఇన్ వల్నరబిలిటీ నోట్ సిఐవిఎన్-2023-0360 అని లేబుల్ చేసింది. శాంసంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో 11, 12, 13, 14పై ప్రభావం చూపే క్లిష్టమైన భద్రతా సమస్యలను సూచిస్తోంది. ఈ లోపాలతో సంభావ్య ప్రభావం, దోపిడీకి సంబంధించి సమస్యలను లేవనెత్తింది.

Read Also : Kia Sonet Bookings : కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు వచ్చేసింది.. ఈ నెల 20 నుంచే బుకింగ్స్ ప్రారంభం!

సీఈఆర్‌టీ-ఇన్ పరిశోధకులు శాంసంగ్ ప్రొడక్టుల్లో అధిక ముప్పును కలిగించే అనేక లోపాలను గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు భద్రతపరమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, సిస్టమ్‌లపై ఆర్బిటరీ కోడ్‌ని ఇంజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. శాంసంగ్ పర్యావరణ వ్యవస్థలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సీఈఆర్టీ-ఇన్ ప్రకారం.. శాంసంగ్ ఉత్పత్తులలో గుర్తించిన లోపాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

* నాక్స్ ఫీచర్‌లలో సరికాని యాక్సెస్ నియంత్రణ.
* ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో ఓవర్‌ఫ్లో లోపం.
* ఏఆర్ ఎమోజి యాప్‌తో అధికార సమస్యలు.
* నాక్స్ భద్రతా సాఫ్ట్‌వేర్‌లో లోపాలను నిర్వహించలేరు.
* వివిధ సిస్టమ్ భాగాలలో మల్టీ మెమరీ లోపాలు
* softsimd లైబ్రరీలో తప్పు డేటా సైజు ధృవీకరణ.
* స్మార్ట్ క్లిప్ యాప్‌లో వ్యాలీడ్ కాని యూజర్ ఇన్‌పుట్.
* కాంటాక్టుల్లో నిర్దిష్ట యాప్ హైజాక్ అవ్వడం

అసలు రిస్క్ ఏంటి? :
దుర్బలత్వాల కారణంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఇందులో హీప్ ఓవర్‌ఫ్లో, స్టాక్ ఆధారిత బఫర్ ఓవర్‌ఫ్లోను ట్రిగ్గర్ చేసేలా అనుమతించవచ్చు. ఈ డివైజ్ సిమ్ పిన్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎలివేటెడ్ ప్రివిలేజ్‌తో పంపవచ్చు. ఏఆర్ ఎమోజి శాండ్‌బాక్స్ డేటాను రీడ్ చేయడం, నాక్స్ గార్డ్‌ను దాటడం వంటివి ఉన్నాయి. సిస్టమ్ సమయాన్ని మార్చడం ద్వారా లాక్ చేయడం, ఆర్బిటరీ ఫైల్‌లను యాక్సెస్ చేయడం, సున్నితమైన సమాచారానికి యాక్సస్ పొందడం, ఆర్బిటరీ కోడ్‌ని రన్ చేయడం వంటివి ఉన్నాయని సెక్యూరిటీ నోట్ పేర్కొంది.

Samsung Galaxy S23 Series

హాని కలిగించే డివైజ్‌‌లివే :
లేటెస్టుగా కనుగొన్న భద్రత లోపాల్లో శాంసంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో 11, 12, 13, 14పై ప్రభావం చూపుతాయి. గెలాక్సీ ఎస్23 సిరీస్, గెలాక్సీ ఫ్లిప్ 5, గెలాక్సీ ఫోల్డ్ 5, ఇతర శాంసంగ్ డివైజ్‌లతో సహా అనేక రకాల శాంసంగ్ డివైజ్‌లను ప్రమాదంలో పడేస్తాయి.

మీ ఫోన్‌ను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే? :
ఈ లోపాలు కలిగిన ఫోన్లలో ప్రమాదాన్ని తగ్గించడానికి వినియోగదారులు ఈ కింది చర్యలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.
సెక్యూరిటీ అప్‌డేట్స్ : వినియోగదారులు తమ అధికారిక సెక్యూరిటీ అడ్వైజరీలో శాంసంగ్ అందించిన భద్రతా అప్‌డేట్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. మీరు Settings > Software Update > డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ డివైజ్ అప్‌డేట్‌ల కోసం చెక్ చేయవచ్చు. అదే సమయంలో, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను యాక్సస్ చేసేందుకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ చెక్ చేయండి. వాటిని ఆయా యాప్స్ ఇన్‌స్టాల్ చేయండి.
జాగ్రత్త వహించండి : అప్‌డేట్ వచ్చేవరకు, వినియోగదారులు ప్రభావితమైన డివైజ్‌లలో ప్రత్యేకించి తెలియని అప్లికేషన్‌లను యాక్సస్ చేయరాదు. అలా చేస్తే జాగ్రత్త వహించాలి.
యాప్‌ లేటెస్ట్ వెర్షన్ అప్‌డేట్ : గడువు ముగిసిన యాప్‌లను అసలు వాడరాదు. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి అప్‌డేట్‌ల కోసం చెక్ చేయడం ద్వారా అన్ని యాప్‌లను లేటెస్ట్ వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి.
యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి : వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాధారాల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయరాదు. ఎందుకంటే అవి హానికరమైనవి కావచ్చు.
లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి : గుర్తుతెలియని పంపినవారి ఇమెయిల్‌లు లేదా మెసేజ్‌లలో లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఈ లింక్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించిన ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అవుతాయి.

Read Also : ChatGPT Outage : చాట్‌జీపీటీ ఈజ్ బ్యాక్.. 40 నిమిషాల పాటు స్తంభించిన ఏఐ టూల్..!

ట్రెండింగ్ వార్తలు