ChatGPT Outage : చాట్‌జీపీటీ ఈజ్ బ్యాక్.. 40 నిమిషాల పాటు స్తంభించిన ఏఐ టూల్..!

ChatGPT Outage : ఏఐ టూల్ చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. 40 నిమిషాల పాటు నిలిచిపోయిన అనంతరం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారిగా టూల్ స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ChatGPT Outage : చాట్‌జీపీటీ ఈజ్ బ్యాక్.. 40 నిమిషాల పాటు స్తంభించిన ఏఐ టూల్..!

ChatGPT back online after ‘major outage,’ OpenAI says

ChatGPT Outage : ఏఐ టూల్ చాట్‌జీపీటీకి ఏమైంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ మరోసారి స్తంభించింది. ఒక్కసారిగా ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోవడంతో భారీ పెద్ద అంతరాయం కలిగింది. చాట్‌జీపీటీ అంతరాయం కారణంగా వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే, అర్ధగంటకు పైగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లోకి వచ్చింది.

Read Also : Google Maps Save Fuel : గూగుల్ మ్యాప్స్‌‌‌లో కొత్త ఫీచర్.. ఈ నావివేగషన్‌తో మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

అయితే, ఎదురైన చాట్ జీపీటీలోని సాంకేతిక సమస్యను పరిష్కరించినట్టు ఓపెన్ఏఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాట్‌జీపీటీ దాదాపు 40 నిమిషాలు పనిచేయలేదని, ఆ సమయంలో సర్వీసు అందుబాటులో లేదని వినియోగదారులు వాపోయారు. వ్యాపారాల కోసం రూపొందించిన చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ కొంతమంది వినియోగదారులకు ‘ఎలివేటెడ్ ఎర్రర్ రేట్‌లను’ ఎదుర్కొంటున్నారని కూడా ఓపెన్ఏఐ తెలిపింది.

వివరణ ఇవ్వని ఓపెన్ఏఐ :
ఈ నెల ప్రారంభంలో చాట్ జీపీటీ మరో సమస్యను ఎదుర్కొంది. అప్పుడు దాదాపు 10శాతం మంది వినియోగదారులు చాట్‌జీపీటీకి మెసేజ్ పంపలేకపోయారని కంపెనీ తెలిపింది. గత నవంబర్‌లో ఏఐ టెక్నాలజీ టూల్ చాట్ జీపీటీకి పెద్ద అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ChatGPT back online after ‘major outage,’ OpenAI says

ChatGPT back online major outage

ప్రస్తుత సాంకేతిక సమస్యలకు కారణమేమిటనే దానిపై ఓపెన్ఏఐ వివరణ ఇవ్వలేదు. ఏఐ కంపెనీ ప్రకారం.. చాట్‌జీపీటీ చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యూజర్ యాప్‌గా రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు వారానికోసారి దాదాపు 100 మిలియన్లతో యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.

అయితే, 92శాతం కన్నా ఎక్కువ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నవంబర్‌లో బోర్డు సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించిన నేపథ్యంలో చాట్‌జీపీటీ సర్వీసులకు అంతరాయం కలిగింది. అదే సమయంలో కంపెనీ ఉద్యోగులు ఆల్ట్‌మన్ తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి రావడంతో కొన్ని రోజుల తర్వాత ఆయన్ను తిరిగి చాట్‌జీపీటీ సీఈఓగా నియమించింది.

Read Also : Kia Sonet Bookings : కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు వచ్చేసింది.. ఈ నెల 20 నుంచే బుకింగ్స్ ప్రారంభం!