Infinix Hot 40i Launch : ఇన్పినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Infinix Hot 40i Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన కెమెరాలతో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర ఎంతంటే?

Infinix Hot 40i Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ఇన్పినిక్స్ హాట్ 40ఐ పేరుతో మొదట సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఈ ప్రాంతంలో ఫోన్ (NFC) కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. ఈ కొత్త ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉందని కంపెనీ ధృవీకరించింది.

అధికారిక సైట్‌లో ఇంకా జాబితా లేదు. కానీ, హ్యాండ్‌సెట్ ఈ-కామర్స్ దిగ్గజాల్లో అమెజాన్, నూన్‌ (Noon)లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 16జీబీ వరకు ర్యామ్ అందించే ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ డ్యూయల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Read Also : Redmi 13C Launch : భారత్‌కు రెడ్‌మి 13C 4G బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఈ తేదీనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ధర, లభ్యత :
సౌదీ అరేబియా యూనిట్ పోస్ట్ ప్రకారం.. కంపెనీ ఇన్పినిక్స్ హాట్ 40ఐ మోడల్ ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొత్తం 4జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీతో రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఇన్ఫినిక్స్ డివైజ్ ధర వరుసగా ఎస్ఓఆర్ 375 (సుమారు రూ. 8,300), ఎస్ఎఆర్ 465 (సుమారు రూ. 10,300)కు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇప్పటికీ ఈ కొత్త ఫోన్ సౌదీ అరేబియా వెబ్‌సైట్‌లో లిస్ట్ కాలేదు. దేశంలోని అమెజాన్, నూన్ వెబ్‌సైట్లలో మాత్రమే లిస్టు అయింది. ఈ ఫోన్ హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, స్టార్‌లిట్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వీఆర్ఏఎమ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో సహా 16జీబీ వరకు ర్యామ్ అందిస్తుంది. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ ద్వారా ఫోన్ పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో కూడా వస్తుంది.

Infinix Hot 40i 

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్హ్ హాట్ 40ఐ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్‌తో పాటు వెనుకవైపు సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ మూడు యూనిట్లు బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో మూడు వేర్వేరు వృత్తాకార స్లాట్‌లలో ఉంటాయి. ముందు కెమెరా డిస్‌ప్లే పైభాగంలో సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌లో ఉంటుంది. 32ఎంపీ సెన్సార్‌తో వస్తుంది.

ఎన్ఎఫ్‌సీ సపోర్టుతో కాంటాక్టులెస్ పేమెంట్లు :
18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ రైట్ ఎడ్జ్ పవర్ బటన్‌పై ఉంటుంది. సౌదీ అరేబియాలో లాంచ్ అయిన ఈ మోడల్ ఎన్ఎఫ్‌సీ ఆప్షన్ కలిగి ఉంది, కంపెనీ షేర్ చేసిన పోస్ట్‌ ప్రకారం.. ఎన్ఎఫ్‌సీ సపోర్టు లేని ఇతర ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్‌లు కూడా ఉండవచ్చు. ఈ ఎన్ఎఫ్‌సీ అనేది కాంటాక్ట్‌లెస్ డేటా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతిస్తుంది. గూగుల్ పే, ఆపిల్ పే వంటి యాప్‌ల ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను కూడా అనుమతిస్తుంది.

Read Also : OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు