OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?

OnePlus Nord CE 3 5G : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గింది. అద్భుతమైన ఆఫర్లతో ఈ ఫోన్ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?

OnePlus Nord CE 3 5G Receives Price Cut in India

OnePlus Nord CE 3 5G : భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గింది. దేశంలో నార్డ్ సిరీస్ ఫోన్ ధర రూ. 2వేలు తగ్గింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ జూన్‌లో రూ. 25వేల సెగ్మెంట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 782జీ ఎస్ఓసీపై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ధర :
భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ధర రూ. 2వేల వరకు తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ. 24,999 ధరతో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభంలో రూ. 26,999 ఉండగా.. 12జీబీ ర్యామ్ +256జీబీ స్టోరేజీతో టాప్-ఎండ్ మోడల్ రూ. 27,999 నుంచి రూ. 28,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ షేడ్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో కొత్త ధరతో వన్‌ప్లస్ అందుబాటులో ఉంది.

Read Also : Redmi 13C Launch : భారత్‌కు రెడ్‌మి 13C 4G బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఈ తేదీనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (నానో) వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అడ్రినో 642ఎల్ జీపీయూ 12జీబీ వరకు (LPDDR4X) ర్యామ్‌తో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 782జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

OnePlus Nord CE 3 5G Receives Price Cut in India

OnePlus Nord CE 3 5G 

ఆప్టిక్స్ విషయానికి వస్తే..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఓఐఎస్, ఈఐఎస్ సపోర్టుతో 50ఎంపీ 1/1.56-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ 4సెం.మీ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి 1టీబీ వరకు విస్తరణకు సపోర్టు ఇస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఎ-జీపీఎస్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఇంకా, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ 80డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Indian Mobile Users : 70 లక్షల భారతీయ యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్.. మీ నెంబర్ సేఫ్‌గా ఉండాలంటే ఈ తప్పు అసలు చేయొద్దు!