Infinix Hot 60i 5G
Infinix Hot 60i 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 60 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ భారత మార్కెట్లో (Infinix Hot 60i 5G) లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G పేరుతో రిలీజ్ అయింది. బడ్జెట్ కేటగిరీలో ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 50MP రియర్ కెమెరా, AI ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G : భారత్ ధర ఎంతంటే? :
ఈ హాట్ 60i 5G ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో రూ.9,299 ధరకు లభిస్తుంది. ప్రత్యేక ఆఫర్‌లతో ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.8,999కి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, ప్లం రెడ్, స్లీక్ బ్లాక్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఆగస్టు 21 నుంచి భారత మార్కెట్లో సేల్ ప్రారంభం కానుంది.
డిస్‌ప్లే : 720×1600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్
ర్యామ్ : 4GB LPDDR4X ర్యామ్
స్టోరేజీ : 128GB eMMC స్టోరేజీ
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15 XOS 5.1
బ్యాక్ కెమెరాలు : 50MP మెయిన్ కెమెరా
ఫ్రంట్ కెమెరా : 5MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 6,000 ఎంఏహెచ్
ఛార్జింగ్ : 18W వరకు ఛార్జింగ్
కొలతలు : మందం 0.814 సెం.మీ, బరువు 199 గ్రా.
కనెక్టివిటీ : 5G, WiFi, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB టైప్-C పోర్ట్
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ఫోన్ కొత్త బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. ప్రీమియం, స్పెషల్ డిజైన్ అందిస్తుంది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఎరేజర్, ఏఐ ఎక్స్‌టెండర్, వాయిస్ సెర్చ్, ఏఐ కాల్ ట్రాన్స్‌లేషన్, ఏఐ డాక్యుమెంట్ సమ్మరైజర్, ఏఐ వాల్‌పేపర్ జనరేటర్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్ కలిగి ఉంది. డివైజ్ డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నావిగేషన్ కోసం “డైనమిక్ బార్” కూడా ఉంది.