Infinix Note 40 Pro 5G First Sale : ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Infinix Note 40 Pro 5G First Sale : వినియోగదారులు రూ. 5వేల విలువైన ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు.

Infinix Note 40 Pro 5G First Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి పవర్‌ఫుల్ మిడ్-రేంజర్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ కొత్త ఫోన్ అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్‌లతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ మిడ్-రేంజ్ ఫోన్‌లతో పాటు ప్రీ-బుక్ చేసిన కొనుగోలుదారులు వైర్‌లెస్ ఛార్జింగ్ మ్యాగ్‌కిట్‌ను కూడా పొందవచ్చు. హుడ్ కింద.. డివైజ్ మీడియాటెక్ డైమన్షిటీ 7020 5జీ ప్రాసెసర్‌తో గరిష్టంగా 16జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. 32ఎంపీ కెమెరాతో పాటు 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంది.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 18 నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ఫోన్ వింటేజ్ గ్రీన్, టైటాన్ గోల్డ్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు రూ. 5వేల విలువైన ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.21,999 ప్రారంభ ధరతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఒకే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు మొబైల్ ఫోన్‌లు ఒకే రకమైన బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ప్రతి మోడల్ గణనీయమైన 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో స్విఫ్ట్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1300నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి. స్క్రీన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రధాన భాగంలో ఈ డివైజ్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 6ఎన్ఎమ్ చిప్ ద్వారా పవర్ అందిస్తాయి.

కెమెరా సామర్థ్యాల పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో లైనప్‌లో 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన హై-రిజల్యూషన్ 108ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తుంది. సెల్ఫీ ప్రియులు 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందవచ్చు. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రారంభం నుంచి ఇన్ఫినిక్స్ ఎక్స్ఓఎస్ 14 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తాయి. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ వేగవంతమైన 100డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,600ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

మరోవైపు, బడ్జెట్-ఫ్రెండ్లీ ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో పెద్ద 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. అయితే, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. రెండు మోడళ్లలో 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ సపోర్టు అందిస్తుంది. రూ. 25వేల కన్నా తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లలో ఇది మొదటిది. అదనపు ఫీచర్లతో డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, జేబీఎల్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్‌లు, ఐపీ53 డ్యూరబిలిటీ రేటింగ్ వంటివి పొందొచ్చు.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

ట్రెండింగ్ వార్తలు