Infinix Note 50s 5G Plus
Infinix Note 50s 5G Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్, 64MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది.
144Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో దేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ వీగన్ లెదర్ ఫినిషింగ్ ఇన్ఫ్యూజ్డ్ ఫ్రాగెన్స్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మార్చిలో అదే చిప్‌తో ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G లైనప్‌లో చేరింది.
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ మోడల్ 8GB + 128GB ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 17,999కు పొందవచ్చు. ఈ ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తుంది. మొదటి సేల్ రోజున వినియోగదారులు అన్ని ఆఫర్‌లతో సహా రూ. 14,999 ధరకే హ్యాండ్‌సెట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, రూబీ రెడ్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్, 2,304Hz PWM డిమ్మింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ SoC ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత XOS 15తో వస్తుంది. గేమింగ్ సమయంలో 90fps ఫ్రేమ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ 64MP సోనీ IMX682 ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ వీడియో క్యాప్చర్‌కు సపోర్టు ఇస్తుంది. ఏఐ టూల్స్, ఫోలాక్స్ ఏఐ అసిస్టెంట్, ఏఐ వాల్‌పేపర్ జనరేటర్, AIGC మోడ్, ఏఐ ఎరేజర్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+లో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W వైర్డ్ ఆల్-రౌండ్ ఫాస్ట్‌ఛార్జ్ 3.0కి సపోర్టు ఇస్తుంది. 60 నిమిషాల్లో ఫోన్‌ను ఒకటి నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ IP64 నీరు, ధూళి-నిరోధక రేటింగ్‌ను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ రూబీ రెడ్, టైటానియం గ్రే వేరియంట్స్ మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉన్నాయి. మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ ఆప్షన్‌లో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉంది. మైక్రోఎన్‌క్యాప్సులేషన్ టెక్నాలజీతో వస్తుంది. వీగన్ లెదర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇందులో మెరైన్, లెమన్ లిల్లీ ఆఫ్ ది వ్యాలీ నోట్స్, అలాగే అంబర్, వెటివర్ బేస్ నోట్స్ ఉన్నాయి.