Infinix Note 50X 5G : ఆ రకమైన చిప్ ఉన్న ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ ఇదే.. దీని లాంఛింగ్ డేట్, ఫీచర్స్..

Infinix Note 50X 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? మార్చి 27న భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ లాంచ్ కానుంది. ముందుగానే డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Note 50X 5G

Infinix Note 50X 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందు, ట్రాన్స్షన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫోన్ డిజైన్ గురించి వివరాలను రివీల్ చేసింది. రెండు రోజుల క్రితమే రియర్ కెమెరా లేఅవుట్ గురించి బయటపెట్టిన ఇన్ఫినిక్స్ ఇప్పుడు రాబోయే హ్యాండ్‌సెట్ ఫుల్ డిజైన్, కలర్ ఆప్షన్లను వెల్లడించింది.

Read Also : Apple iPhone 16 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16పై భారీగా తగ్గింపు.. ఐఫోన్ 16e కన్నా బెటర్ డీల్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని మైక్రోసైట్ ఫోన్ చిప్‌సెట్ వివరాలను కూడా వెల్లడించింది. ఇన్ఫినిక్స్ XOS 15 స్కిన్‌, ఆండ్రాయిడ్ 15తో రానున్న బ్రాండ్ మొదటి హ్యాండ్‌సెట్ నోట్ 50X 5G ఫోన్ అని పేర్కొంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G డిజైన్, కలర్ ఆప్షన్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G మార్చి 27న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో రానుంది. నివేదికల ప్రకారం.. డిజైన్ రెండర్‌లు ఫోన్‌ను గ్రీన్, గ్రే, పర్పల్ కలర్ ఆప్షన్లలో రానుంది. గ్రీన్ ఆప్షన్ టెక్స్చర్డ్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో కనిపిస్తుంది. మిగిలిన రెండు మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉంటాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ మిలిటరీ-గ్రేడ్ (MIL-STD 810H) మన్నికను కలిగి ఉందని వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ సన్నని బెజెల్స్, మందమైన చిన్, ఫ్రంట్ కెమెరాను పట్టుకునేలా పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్ స్లాట్‌తో డిస్‌ప్లేను సూచిస్తుంది.

అంతేకాదు.. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ రైడ్ ఎడ్జ్ ఉంటాయి. లెఫ్ట్ ఎడ్జ్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. గతంలో, ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ యాక్టాగోనల్ ‘జెమ్-కట్’ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఇందులో 3 కెమెరా సెన్సార్లు, ఒక IR సెన్సార్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ఒక యాక్టివ్ హాలో యూనిట్ ఉన్నాయి. రెండోది సెల్ఫీ టైమర్, ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, నోటిఫికేషన్ లైట్‌, గేమ్ బూట్-అప్ సమయంలో డైనమిక్ ఎఫెక్ట్”ను అందిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..!

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ రివీల్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ SoC పవర్‌తో వస్తుందని ధృవీకరిస్తుంది. ఈ చిప్‌సెట్‌ను పొందిన ప్రపంచంలోనే ఫస్ట్ హ్యాండ్‌సెట్ ఇదే. ఈ ఫోన్ 90fps లాగ్-ఫ్రీ గేమింగ్ పర్ఫార్మెన్స్ మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ సపోర్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G బ్రాండ్ నుంచి ఆండ్రాయిడ్ 15-ఆధారిత XOS 15తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ (AIGC) పోర్ట్రెయిట్ మోడ్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్, ఏఐ నోట్, ఫోలాక్స్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఏఐ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.