Instagram Edit Message : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. పంపిన మెసేజ్ ఇకపై ఎడిట్ చేయొచ్చు.. కేవలం 15 నిమిషాల్లోపు మాత్రమే..!

Instagram Message Editing : ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పంపిన మెసేజ్ 15 నిమిషాల వ్యవధిలోనే ఎడిట్ చేసుకునే వీలుంటుంది. మీరు ఎడిట్ చేసిన తర్వాత చాట్‌లోని ఎడిట్ చేసిన మెసేజ్ పైన ‘ఎడిటెడ్’ అనే లేబుల్ డిస్‌ప్లే అవుతుంది.

Instagram Message Editing : ప్రముఖ మెటా సొంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మీరు పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల వ్యవధిలో ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తోంది. ఇన్‌స్టా యూజర్లకు సరికొత్త ఎడిట్ ఫీచర్ ప్రవేశపెట్టింది.

ఇప్పటికే, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఎడిట్ ఫీచర్ అందుబాటులో ఉంది. యూజర్ ఎవరైనా ఇతరులకు తప్పుగా లేదా పొరపాటుగా మెసేజ్ పంపినప్పుడు అది డిలీట్ చేసి మళ్లీ పంపాల్సిన అవసరం ఉండదు. అదే మెసేజ్ ఎడిట్ చేసి తప్పుగా పడిన అక్షరాల్లో మార్పులు చేసుకోవచ్చు.

Read Also : Instagram Custom Stickers : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫోన్‌లో ఫొటోలతో కస్టమ్ స్టిక్కర్లు క్రియట్ చేసి షేర్ చేయొచ్చు!

అది అక్షర దోషమైనా లేదా యూజర్ మనసు మార్చుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మెసేజ్ సరిదిద్దగల సామర్థ్యం అందరికి అందుబాటులో ఉంది. అయితే, ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పంపిన మెసేజ్ ఎడిట్ చేయాలంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఎడిట్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఎడిట్ చేయడం కుదరదని గమనించాలి. అదేవిధంగా, కొత్తగా పంపిన మెసేజ్ మాదిరిగా ఈ ఎడిటెడ్ మెసేజ్ కనిపించదు. మీరు ఎడిట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మీకు ఎడిటెడ్ అనే లేబుల్‌తో కనిపిస్తుంటుంది. అంటే.. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎడిట్ చేశారు అనే విషయం అందుకున్న వ్యక్తికి కూడా తెలుస్తుంది అనమాట..

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు ఈ కిందివిధంగా ప్రయత్నించండి :

మెసేజ్ ఇలా ఎడిట్ చేయండి :

  • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • మీ కాన్వర్జేషన్ నావిగేట్ చేయండి. మీరు ఇటీవల పంపిన మెసేజ్ ఎంచుకోండి.
  • ఆ మెసేజ్ నొక్కి పట్టుకోండి.
  • కనిపించే ఆప్షన్ల నుంచి ‘Edit’ ఎంచుకోండి.
  • దయచేసి ఈ ఆప్షన్ సమయ పరిమితిని దాటితే ఇకపై అందుబాటులో ఉండకపోవచ్చనని గుర్తుంచుకోండి.
  • మీ మెసేజ్ రీవైజ్ టెక్స్ట్ ఎడిట్ చేయండి.
  • కొత్త మార్పుల తర్వాత చాట్‌లో మీ మెసేజ్ అప్‌డేట్ చేసేందుకు ‘Send’ నొక్కండి.
  • మెసేజ్ ఎడిట్ చేసిన తర్వాత చాట్‌లో మీ ఎడిట్ చేసిన మెసేజ్ పైన ‘Edited’ అని కనిపిస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి :

Instagram Message Editing

  • ఇతరులు చాట్‌లో లేదా నోటిఫికేషన్ నుంచి వచ్చిన మెసేజ్ ఎడిట్ చేసే ముందే చదివి ఉండవచ్చు.
  • చదవని నోటిఫికేషన్‌లు మీ ఎడిట్ చేసిన మెసేజ్‌తో రిప్లేస్ అవుతాయి.
  • మీరు ఎడిట్ చేసిన మెసేజ్ రిపోర్టు చేసినట్టుయితే ఎడిట్ హిస్టరీ రిపోర్టులో యాడ్ అవుతుంది.
  • మీరు ప్రస్తావనలు లేదా ఆదేశాలను కలిగిన మెసేజ్‌లను ఎడిట్ చేయలేరు. కానీ మీరు వాటిని unsend చేయవచ్చు.
  • మీరు పంపే ప్రతి సందేశాన్ని ఐదు సార్లు వరకు సవరించవచ్చు.

Read Also : Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. మీ పోస్టులు క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు