Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. మీ పోస్టులు క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎంపిక చేసిన స్నేహితుల గ్రూపులో పోస్ట్‌లు, రీల్స్‌ను షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. మీ పోస్టులు క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Instagram-Users

Instagram Reels : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అందులోభాగంగానే ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌ను మరింతగా విస్తరిస్తోంది. తద్వారా వినియోగదారులు తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.

Read Also : Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వారి ప్రైవసీ, ప్లాట్‌ఫారమ్‌లో వారు షేర్ చేసే కంటెంట్‌పై మరింత కంట్రోల్ పొందుతారు. సన్నిహిత మిత్రులతో షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. క్రియేటర్ల విషయానికొస్తే.. విస్తరించిన ఫీచర్ ఆదాయ-ఉత్పాదక ఆప్షన్లను కూడా అందించవచ్చు. ఎందుకంటే పేమెంట్ చేసేందుకు ఇష్టపడే యూజర్లతో ప్రత్యేకమైన కంటెంట్‌ను షేర్ చేసే వీలుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్‌ఫ్రెండ్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :

* సన్నిహిత స్నేహితులతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను షేర్ చేయండి.
* ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఫీడ్‌కి వెళ్లండి.
* కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసేందుకు స్క్రీన్ దిగువన ఉన్న ‘+’ ఐకాన్‌పై నొక్కండి.
* మీరు క్రియేట్ చేయాలనుకునే పోస్ట్ టైప్ ఎంచుకోండి (ఫోటో, వీడియో లేదా స్టోరీ).
* మీరు మీ ఫోన్ గ్యాలరీ నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి.
* మీ పోస్ట్‌కు క్యాప్షన్ ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోండి.

Instagram-Reels-Posts

Instagram-Reels-Posts

* క్యాప్షన్ బాక్స్ దిగువన ఉన్న ‘Audience’ ఆప్షన్‌పై నొక్కండి.
* ఆప్షన్ల లిస్టు నుంచి ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఎంచుకోండి.
* మీ పోస్ట్‌ను పబ్లీష్ చేసేందుకు టాప్ రైడ్ కార్నర్‌లో ఉన్న ‘షేర్’ బటన్‌పై నొక్కండి.
* సన్నిహిత స్నేహితులతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను భాగస్వామ్యం చేయండి.
* ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ దిగువన ఉన్న ‘+’ ఐకాన్ నొక్కండి. ఆప్షన్ల నుంచి ‘రీల్’ ఎంచుకోండి.
* కొత్త వీడియోను రికార్డ్ చేయడానికి రికార్డ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి లేదా మీ ఫోన్ గ్యాలరీ నుంచి ఇప్పటికే ఉన్న వీడియోను అప్‌లోడ్ చేసేందుకు కెమెరా రోల్ ఐకాన్ నొక్కండి.
* మీ రీల్‌కి ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ మ్యూజిక్ జోడించడానికి ఎడిట్ టూల్స్ ఉపయోగించండి.
* క్యాప్షన్ బాక్స్ దిగువన ఉన్న ‘Audience’ ఆప్షన్‌పై నొక్కండి. ఆప్షన్ల జాబితా నుంచి ‘Close Friends’ ఎంచుకోండి.

ఇన్‌స్టాలో లిరిక్స్ బటన్ :

మీరు మీ ప్రేక్షకులను ఎంచుకున్న తర్వాత ఎగువ కుడి మూలలో ఉన్న ‘Share’ బటన్‌ను నొక్కండి. మీ రీల్ మీ సన్నిహిత స్నేహితుల జాబితాతో షేర్ చేస్తుంది. ఇంతలో, ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లతో యూజర్ ఎక్స్‌పీరియన్స్, ప్రైవసీని మెరుగుపరుస్తుంది. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పాటల సాహిత్యాన్ని జోడించే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది స్టోరీస్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి.. మీ రీల్‌ని ఎడిట్ చేస్తున్నప్పుడు లిరిక్స్ బటన్‌ను ట్యాప్ చేయండి.

Instagram-Users

Instagram-Users

ఆ తర్వాత పాటను ఎంచుకోండి. లిరిక్స్ యాడ్ చేసేందుకు ఎడమవైపుకు స్వైప్ చేయండి. మరోవైపు.. ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌తో ప్రయోగాలు చేస్తోంది. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లను చదివినప్పుడు ఇతరులు చూడగలరో లేదో కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. వాట్సాప్ ‘టర్న్ ఆఫ్ రీడ్ రీసిప్ట్’ ఫీచర్ మాదిరిగానే ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్ యూజర్లకు వారి డైరెక్ట్ మెసేజ్ (DM)ల కోసం రీడ్ రీసిప్ట్ స్టాప్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.

Read Also : Google CEO Sundar Pichai : దీపావళి గురించి భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన 5 ప్రశ్నలివే.. రివీల్ చేసిన సుందర్ పిచాయ్!