Instagram May Soon Allow Longer Videos Of Up To 60 Seconds To Be Posted As Stories
Instagram Longer Videos : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సొంత ఫొటో షేరింగ్ యాప్ (Instagram)లో క్రేజీ అప్ డేట్ ఒకటి రానుంది. సెలబ్రిటీ యూజర్ల నుంచి సాధారణ యూజర్లకు అందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పటివరకూ ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్టు చేసుకునే వీడియోల నిడివిని పెంచుతున్నట్టు ఇన్‌స్టా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇన్ స్టా స్టోరీస్ లో ఏదైనా వీడియో పోస్టు చేస్తే.. 24 గంటల వరకు మాత్రమే విజబుల్ ఉంటుంది. ఆ తర్వాత స్టోరీస్ అదృశ్యమైపోతాయి. ఇప్పటివరకూ ఇన్‌స్టా స్టోరీల్లో వీడియోల నిడివి కేవలం 15 సెకన్ల సమయం మాత్రమే ఉండేది. రాబోయే ఇన్ స్టా కొత్త అప్ డేట్ ద్వారా స్టోరీస్‌లో లాంగర్ వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. అంటే.. 60 సెకన్ల వరకు లాంగర్ వీడియోలను పోస్టు చేసుకునేందుకు ఇన్ స్టా అనుమతిస్తోంది.
వీడియో నిడివిని 60 సెకండ్ల వరకు పెంచినట్టు ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లకు నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఇన్‌స్టా తమ యూజర్ల బేస్ మరింత పెంచుకునే దిశగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు నివేదిక తెలిపింది. షార్ట్ వీడియోస్ ప్లాట్ ఫాంపై ఇన్‌స్టాకు ఇతర పోటీదారులైన స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి యాప్స్ గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ సెక్షన్‌లో షార్ట్ వీడియోస్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ ఇప్పటికే నంబర్ వన్‌గా దూసుకుపోతోంది. స్నాప్‌చాట్ ప్లాట్ ఫాం కూడా షార్ట్ వీడియోల కోసం కొత్త యాప్ తీసుకొచ్చింది. షార్ట్ వీడియో లవర్స్ కూడా ఇన్‌స్టా నుంచి ఇతర యాప్స్‌కు మారుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కూడా తన యూజర్ల బేస్ పడిపోకుండా ఉండేందుకు కొత్త అప్‌డేట్స్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను 60 సెకన్ల నిడివి అంటే ఒక నిమిషం వరకు పెంచింది.
ఇన్‌స్టా కొత్త అప్‌డేట్‌లో స్టోరీస్ నిడివి 60 సెకన్లు ఉండనుంది. స్టోరీలో అప్ లోడ్ చేసిన వీడియో 15 సెకన్ల దాటితే.. ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోతోంది. ఒకే స్టోరీ అప్ లోడ్ చేసినప్పటికీ కూడా ఆ వీడియో నిడివి రెండు నుంచి మూడు స్టోరీలుగా విడిపోతోంది. దాంతో ఇన్ స్టా్ యూజర్లు అసంతృప్తికి లోనవుతున్నారు. సింగిల్ వీడియోగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కొత్త ఇన్‌స్టా అప్‌డేట్ ప్రకారం.. 60 సెకండ్ల వరకూ ఒకే స్టోరీ అప్ లోడ్ చేసుకోవచ్చు. ఇకపై నిమిషం నిడివి వరకు అప్ లోడ్ చేసే ఏ వీడియో కూడా రెండు, మూడు స్టోరీలుగా విడిపోదు.
Instagram is testing longer stories segments of up-to 60 seconds
Spotted by @yousufortaccom in Turkey pic.twitter.com/6LJ2Rjqbpz
— Matt Navarra (@MattNavarra) December 15, 2021
ఇది ఇన్‌స్టా యూజర్లకు ప్రయోజనకరంగా ఆసక్తికరంగా ఉంటుందని ఇన్‌స్టా భావిస్తోంది. అంతేకాదు.. ఇన్‌స్టాలో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చింది.. లోకేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టా ప్రవేశపెట్టిన ఈ కొత్త అప్ డేట్.. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టా యూజర్లందరికి అందుబాటులోకి తీసుకొచ్చిందా? కొన్ని దేశాలకే పరిమితం చేసిందా? అనేది క్లారిటీ లేదు. కొంతమంది ఇన్ స్టా యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మీ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ అప్ డేట్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.
Read Also : WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!