iPhone Animations: ఈ ఐఫోన్ వెర్షన్‌లో అన్ని యాప్‌లకు 120HZ యానిమేషన్స్

యాపిల్ ఐఫోన్ 13 ప్రో (ప్రో మ్యాక్స్)లో 120Hz ప్రమోషన్ డిస్ ప్లేతో రానుంది. అది కేవలం సెకనుకు 120 ఫ్రేముల డిస్ ప్లే అందించగల యాప్ లకు మాత్రమే అందించేది.

iPhone Animations: యాపిల్ ఐఫోన్ 13 ప్రో (ప్రో మ్యాక్స్)లో 120Hz ప్రమోషన్ డిస్ ప్లేతో రానుంది. అది కేవలం సెకనుకు 120 ఫ్రేముల డిస్ ప్లే అందించగల యాప్ లకు మాత్రమే అందించేది. అలాంటిది ఐఓఎస్ 15.4 బీటాతో అన్ని అప్లికేషన్లకు 120 Hzల యానిమేషన్ అందిస్తున్నారట.

దీనిని బట్టి చూస్తుంటే యాపిల్ కోర్ యానిమేషన్ బగ్ క్లియర్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వెర్షన్ రిలీజ్ అయ్యేంతవరకూ సెకనుకు 120ఫ్రేములు రావడమనేది ఊహాగానం మాత్రమే.

దాంతోపాటు iOS 15.4 బీటా వెర్షన్ లో ఫేస్ మాస్క్ ఉన్నా ఫేస్ ఐడీని అన్ లాక్ తీసుకునే ఫీచర్ తీసుకొస్తున్నారు. కంటిచుట్టూ ఉన్న భాగాన్ని గుర్తించే యూనిక్ ఫీచర్లతో రూపొందించనుంది ఈ టెక్ దిగ్గజం. కాకపోతే ఈ ఫీచర్ వాడుకోవాలనుకుంటే మాస్క్ పెట్టుకుని ఫేస్ తో ఒకసారి రీస్కాన్ చేసుకోవాల్సి ఉంటుందట.

Read Also : ఒప్పో రెనో కొత్త 5G స్మార్ట్ ఫోన్

ట్రెండింగ్ వార్తలు