Oppo Reno 7 5G : ఒప్పో రెనో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫిబ్రవరి 4నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో నుంచి కొత్త రెనో 5G సిరీస్ వస్తోంది. భారత మార్కెట్లో Reno 7 5G, Reno 5G Pro అధికారికంగా లాంచ్ కానున్నాయి.

Oppo Reno 7 5G : ఒప్పో రెనో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫిబ్రవరి 4నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా?

Oppo Reno 7 5g, Reno 7 Pro

Oppo Reno 7 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో నుంచి కొత్త రెనో 5G సిరీస్ వస్తోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 4న అధికారికంగా లాంచ్ కానుంది. Oppo Reno 7 5G, Reno 7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి వివరాలు లాంచింగ్ ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Vanilla Oppo Reno 7 5G చైనా వెర్షన్ రెనో 7 Reno 7 SE స్మార్ట్ ఫోన్‌కు పూర్తిగా భిన్నంగా ఈ రెనో 7 సిరీస్ రానుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC , 64-MP ప్రైమరీ కెమెరాతో రానుంది. Oppo Reno 7 5G , Reno 7 Pro 5G ఫోన్ ఫిబ్రవరి 7 (శుక్రవారం) నుంచి భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

Oppo Reno 7 5G ధర (అంచనా) :
Oppo Reno 7 5G, Reno 7 Pro 5G భారత మార్కెట్లో ధర ఎంత ఉండనున్నాయో టిప్‌స్టర్ సుధాన్షు అంభోర్ వివరించారు. Oppo Reno 7 5G స్మార్ట్ ఫోన్ ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,990 నుంచి అందుబాటులో ఉండనుంది. టిప్‌స్టర్ ప్రకారం… Oppo Reno 7 Pro 5G సింగిల్ 12GB + 256GB మోడల్‌ ప్రారంభ ధర రూ. 39,990 ఉండనుంది. రిటైలర్ జాబితా కంటే ఈ స్మార్ట్ ఫోన్ ధర కాస్తా భిన్నంగా ఉంటుంది . Reno 7 5G ధర 8GB + 128GB వెర్షన్ రూ. 31,490గా ఉంటుందని అంచనా.

Oppo Reno 7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా) :
రాబోయే ఫోన్ Oppo Reno 7 డిజైన్‌ సరికొత్తగా ఉండనుంది. యూజర్లను ఆకట్టుకునేలా Oppo Reno 7 5G భారతీయ వేరియంట్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్లో స్పెసిఫికేషన్లు కూడా ఎలా ఉండనున్నాయో ఆంబోర్ ట్వీట్ చేశారు. ఒప్పో రెనో 7 5G స్మార్ట్ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 900 SoC, 8GB RAM, 5GB వర్చువల్ RAM వరకు కేపాసిటి పెంచుకోవచ్చు. చైనాలో Reno 7 5Gలో స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ కంటే భారత మార్కెట్లో రాబోయే Reno 7 5G సిరీస్ ఫీచర్లు కాస్తా భిన్నంగా ఉండనున్నాయి.

భారతీయ వేరియంట్ 64-MP OmniVision OV64B ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-MP అల్ట్రా-వైడ్ షూటర్, 2-MP మాక్రో షూటర్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. Oppo Reno 7 5G ఫ్రంట్ భాగంలో 32-MP Sony IMX615 సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో రానుంది. సెల్ఫీ కెమెరా కూడా చైనీస్ వేరియంట్‌లో మాదిరిగా సోనీ IMX709 సెన్సార్‌కి భిన్నంగా ఉండనుంది.

భారత మార్కెట్లో Oppo Reno 7 5Gలో 65W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 4,500mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ , 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. భారత మార్కెట్లో Oppo Reno 7 5G స్మార్ట్ ఫోన్ 7.81mm మందమైన డిజైన్‌తో 173 గ్రాముల బరువు ఉంటుంది. చైనా వెర్షన్ స్మార్ట్ ఫోన్ Reno 7 5G స్మార్ట్ ఫోన్ 7.59mm డిజైన్‌తో 185 గ్రాముల బరువు ఉంటుంది.

Reno 7, Reno 7 Pro స్మార్ట్ ఫోన్, చైనాలో లాంచ్ చేసిన Reno 7 SE 5G రీబ్రాండెడ్ వెర్షన్ టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. Reno 7 SE 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 48MP సోనీ IMX581 ప్రైమరీ సెన్సార్, 2MP, మాక్రో షూటర్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో 16-MP సోనీ IMX471 సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉన్నాయి.

Reno 7 5G మాదిరిగా కాకుండా.. భారతదేశంలో Reno 7 Pro 5G చైనాలోని మోడల్ మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. Reno 7 Pro 5G ఇండియా వేరియంట్.. చైనీస్ వెర్షన్ మాదిరిగానే కస్టమ్-డిజైన్ MediaTek డైమెన్సిటీ 1200 Max SoC ధృవీకరించింది. ఫోన్ ColorOS 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. SuperVooC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. భారతదేశంలో Reno 7 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Read Also : 1961 January 31 : అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు..