1961 January 31 : అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు..

ఈరోజే అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు. 1961లో మొదటిసారిగా హైమ్ (#65 చాంగ్) అనే చింపాంజీ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించింది.

1961 January 31 : అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు..

Today History Nasa First Chimpanzee In Space

Today History..Chimpanzee first into space : టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక అంతరిక్షంలోకి మనుషులు ఏదో టూరుకు వెళ్లినట్లుగా వెళ్లి వచ్చేస్తున్నారు. చందమామ మీదకు కూడా టూర్లు వేసే యోచనలో ఉన్నారు. కానీ ఒకప్పుడు అంతరిక్షంలోకి జంతువుల్ని పంపేవారు. కోతులు, కుక్కలు, చింపాంజీలను పంపించారు శాస్త్రవేత్తలు. అలా అంతరిక్షంలోకి తొలిసారిగా శాస్త్రవేత్తలు ఓ చింపాంజీని పంపించారు. అది ఈరోజే..జనవరి 31. 1961 లో సరిగ్గా ఇదే రోజున వెళ్లింది. ఆ చింపాంజీ పేరు #65 చాంగ్…వయస్సు మూడున్నరేళ్లు.

1959 లో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చిన తరువాత ఈ చింపాజీకి శాస్త్రవేత్తలు ఎన్నో పరీక్షలు చేశారు. మరెన్నో విషయాలు నేర్పించారు. జంతువుల్లో ముఖ్యంగా కోతి జాతికి చెందివాటిలో ఉరాంగ్ ఉటాన్ కోతులే కాకుండా చింపాంజీలు కూడా చాలా తెలివైనవి. అచ్చు మనిషిలాగానే చేస్తాయి చింపాంజీలు. ఏదైనా వాటిని నేర్పిస్తే చాలా చక్కగా చేస్తాయి. అలా అంతరిక్షంలోకి పంపించాలనుకున్న ఈ #65 చాంగ్ అనే చింపాంజీకి శాస్త్రవేత్తలు ఎన్నో నేర్పించారు.

#65 చాంగ్ చింపాంజీ అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత దాని పేరు కూడా మార్చారు. అలా దాని పేరును హైమ్ గా మార్చారు. హైమ్‌ అనే ఈ చింపాంజీ.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జంతువుగా చరిత్ర సృష్టించింది అప్పట్లో. ఆతరువాత శాస్త్రవేత్తలు ఎన్నో జంతువుల్ని, ప్రాణుల్ని పంపించారు. మనిషి అంతరిక్షంలోకి వెళ్తే ఎటువంటి ప్రభావాలు ఉంటాయనే సమాచారం తెలుసుకునేందుకే ఈ చింపాంజీని అంతరిక్షంలోకి పంపారు. సాధారణంగా ఏవైనా మెడిసిన్స్ కనిపెడితే వాటిని మొదట జంతువులమీదనే ప్రయోగిస్తారు. అలా కోతులు,పందులు, ఎలుకలపై ప్రయోగిస్తారనే విషయం తెలిసిందే. అలా అంతరిక్షంలోకి వెళ్లటానికి పరిశోధకులు మొదటిసారిగి ఈ చింపాంజీని పంపించారు.

1957లో జన్మించిన ఈ చింపాంజీని కామెరూన్ అడవుల నుంచి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి తీసుకొచ్చారు. ఫ్లోరిడాలోని మయామి రేర్ బర్డ్ ఫర్మ్‌లో ఇది ఉండటానికి అన్ని వసతులు కల్పించారు. 1959లో అంతరిక్షంలో టైనింగ్ కోసం అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్‌కు పంపించారు. 18 నెలల శిక్షణ అనంతరం హైమ్ అంతరిక్షంలోకి వెళ్లడానికి అన్ని రకాలుగా సిద్ధం చేశారు. మూడున్నరేండ్ల వయసున్న చింపాంజీని కంటైనర్‌లో కట్టి అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోకి ప్రవేశించే సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హైమ్‌ ప్రయాణిస్తున్న క్యాప్సూల్‌ దెబ్బతింది. కానీ హైమ్‌ వేసుకున్న స్పేస్‌ సూట్‌ వల్ల దానికి ఏమీ కాలేదు.

భూమికి తిరిగి వస్తున్న సమయంలో హైమ్ ప్రయాణిస్తున్న క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది. దానిని కాపాడేందుకు ఓడ గంటల వ్యవధిలో ఘటనాస్థలికి చేరుకున్నా హైమ్‌కు ఎలాంటి నష్టం జరుగకపోవటం విశేషం. కాప్సూల్‌లోంచి బయటకు తీసి దాన్ని భద్రంగా ఫ్లోరిడాకు తీసుకెళ్లారు. తరువాత 1963లో వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో ఆ చింపాంజీకి నివాసం ఏర్పాటుచేసి దాన్ని అత్యంత జాగ్రత్తగా సంరక్షించారు. ఆ తరువాత కొన్నాళ్లకు దాన్ని నార్త్ కరోలినా జూకి తరలించారు. అలా పలు విధాలుగా దాన్ని సంరక్షించారు. ఈ క్రమంలో హైమ్ 1983 జనవరి 19 న మరణించింది. అలా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీగా హైమ్ (#65 చాంగ్) చరిత్ర సృష్టించింది.

Monkeys, Apes and Dogs in orbit: What Happen to Laika, the Space Dog

కాగా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి కుక్క పేరు లైకా. రష్యాకు చెందిన సోవియెట్ యూనియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ.. తొలిసారిగా కుక్కను అంతరిక్షంలోకి పంపించిది.అంతరిక్షంలో జీవుల మనుగడ సాధ్యమా.. కాదా.. అని తెలుసుకోవడం కోసం అప్పట్లో పరిశోధనలు జరిగాయి. అయితే, మనుషులను స్పేస్‌లోకి పంపిస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించి.. శునకాన్ని పంపించాలని నిర్ణయించారు.

దీంట్లో బాగంగా మూడేళ్ల వయస్సు గల లైక అనే వీధి కుక్కను ఎంపిక చేసి.. దానికి ట్రైనింగ్ ఇచ్చి 1957, నవంబరు 3వ తేదీన 80 సెంటీ మీటర్లు పొడవుండే స్పేస్ క్యాప్సుల్‌లో లైకాను ఉంచి ర్యాకెట్(స్పూత్నిక్-2) ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. ఈ సందర్భంగా పరిశోధకులు లైకా హార్ట్ బీట్‌ను పరిశీలించారు. రాకెట్ ద్వారా ఆకాశంలోకి దూసుకెళ్తున్న సమయంలో లైకా అయోమయానికి గురైంది. గుండె వేగంగా కొట్టుకుంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత దాని గుండె దడ తగ్గింది. అంతా బాగుంది కదా అనుకొనే సమయానికి ఊహించని విషాదం చోటుచేసుకుంది.

రాకెట్ భూమి నుంచి 9వ కక్ష్యలోకి చేరగానే లైకాను ఉంచిన స్పేస్ క్యాప్సుల్‌లో క్రమేనా ఉష్ణోగ్రత పెరగడం మొదలైంది. దీంతో 15 సెకన్లలోనే చనిపోయింది. దాదాపు ఏడు రోజులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిండిన క్యాప్సుల్‌లోనే లైకా పరిభ్రమించింది. అయితే, అది వేడిని తట్టుకోలేక చనిపోయిందా? ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోయిందా అనే విషయం మీద స్పష్టత రాలేదు. లైకా అంతరిక్షంలోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే చనిపోయింది. కానీ, వెంటనే లైకా భూమి మీదకు తిరిగి రాలేదు. సుమారు ఐదు నెలలు అంతరిక్షంలోనే పరిభ్రమించింది. 2,570 కక్ష్యలు తిరుగుతూ ఏప్రిల్ 14, 1958న తిరిగి భూమి మీదకు చేరింది. కానీ, దాని అవశేషాలు మాత్రం లభించలేదు. ‘లైకా’ ఆడ కుక్క. మగ కుక్కలు ఆకారంలో పెద్దగా ఉంటాయనే ఉద్దేశంతో పరిశోధకులు చిన్నగా ఉండే ఆడ కుక్కను ఎంచుకున్నారు. అయితే, లైకా చేసిన ప్రాణ త్యాగం ఇప్పటికీ పదిలంగా ఉంది. లైకా ఫొటోతో స్టాంప్ కూడా చెలామణిలో ఉంది.