WWDC 2024 iOS 18 Release : ఆపిల్ మెగా ఈవెంట్‌లో iOS 18 అప్‌డేట్ రిలీజ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు ఇదిగో!

WWDC 2024 iOS 18 Release : ఆపిల్ యూజర్లందరూ iOS18ని పొందలేరు. ఏయే ఏ ఐఫోన్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారో వారికి మాత్రమే ఐఓఎస్18 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Check here to know if your iPhone ( Image Source : Google )

WWDC 2024 iOS 18 Release : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదిలో (WWDC 2024) ఈవెంట్ తేదీని ప్రకటించినప్పటి నుంచి iOS18 ప్రకటనపై అనేక రుమర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఆపిల్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్‌కు మరింత పవర్ అందించే రాబోయే ఓఎస్ ఆపిల్ ప్రకటిస్తుందని చాలా నివేదికలు పేర్కొన్నాయి.

ఊహించినట్టుగానే డబ్ల్యూడబ్ల్యూడీసీ మొదటిరోజు (జూన్ 10), కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం ఐఫోన్ యూజర్ల కోసం iOS18ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, iOS18 బెనిఫిట్స్ ఆస్వాదించడానికి ఇంకా కొన్ని నెలలు వేచి ఉండవలసి ఉంటుంది. అంతేకాకుండా, అన్ని ఐఫోన్ మోడల్‌లకు ఇది అందుబాటులో ఉండదు. ఆపిల్ యూజర్లందరూ iOS18ని పొందలేరు. ఏయే ఏ ఐఫోన్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారో వారికి మాత్రమే ఐఓఎస్18 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read Also : Yamaha Fascino S Launch : సెక్యూరిటీ ఫీచర్లతో యమహా ఫాసినో S స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ఐఓఎస్ 18 రిలీజ్ డేట్, సపోర్ట్ చేసే ఐఫోన్లు :
ఆపిల్ (WWDC 2024) ప్రకటన వెలువడిన వెంటనే iOS18 డెవలపర్ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. డెవలపర్‌ల కోసం లేటెస్ట్ ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తోంది. రాబోయే వారాల్లో మరింత స్థిరమైన బగ్-రహిత పబ్లిక్ బీటా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ యూజర్ల కోసం iOS18 అధికారికంగా సెప్టెంబరు 2024లో లాంచ్ అవుతుంది.కొత్త ఐఫోన్ 16 లైనప్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

ఆపిల్ ఐఓఎస్ 18ని పొందే ఫోన్ల గురించి మాట్లాడుతూ.. ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త ఏఐ పవర్డ్ ఫీచర్‌లు, ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ సిరి సామర్థ్యాలు, A17ప్రో చిప్ లేదా ఆ తర్వాతి ఐఫోన్లలోమాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు ఐఫోన్ 15ప్రో, ప్రో మ్యాక్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ, అన్ని ఐఓఎస్18 సపోర్టు ఫోన్లలో ఇతర అప్‌గ్రేడ్స్ అందుబాటులో ఉంటాయి.

ఐఓఎస్18కి సపోర్టు చేసే ఐఫోన్ల పూర్తి జాబితా :

 • ఐఫోన్ 15
 • ఐఫోన్ 15 ప్లస్
 • ఐఫోన్ 15 ప్రో
 • ఐఫోన్ 15ప్రో మ్యాక్స్
 • ఐఫోన్ 14
 • ఐఫోన్ 14 ప్లస్
 • ఐఫోన్ 14 ప్రో
 • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
 • ఐఫోన్ 13
 • ఐఫోన్ 13 మినీ
 • ఐఫోన్ 13 ప్రో
 • ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
 • ఐఫోన్ 12
 • ఐఫోన్ 12 మినీ
 • ఐఫోన్ 12 ప్రో
 • ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
 • ఐఫోన్ 11
 • ఐఫోన్ 11ప్రో
 • ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్
 • ఐఫోన్ ఎక్స్ఎస్
 • ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్
 • ఐఫోన్ ఎక్స్ఆర్
 • ఐఫోన్ ఎస్ఈ (2వ జనరేషన్ లేదా ఆపై వెర్షన్)

iOS18 రాబోయే ఫీచర్లు ఇవే :
ఐఓఎస్ 18లో రాబోయే కొన్ని ఫీచర్లలో ఓఎస్ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్‌లో యాప్‌లు, విడ్జెట్‌లను ఏర్పాటుకు లేటెస్ట్ విధానంతో సహా అనేక కస్టమైజడ్ ఆప్ష్లను ప్రవేశపెడుతుంది. మీరు ఇప్పుడు డాక్ పైన కూడా ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఐకాన్స్, విడ్జెట్‌లను ఫ్రీగా సెట్ చేయొచ్చు. డార్క్ లేదా లేంటెడ్ థీమ్‌ల వంటి విజువల్ ఎఫెక్ట్‌లను కూడా అప్లయ్ చేయొచ్చు. ఫోటోల యాప్ కూడా ఫోటో లైబ్రరీలను ఒకే వ్యూలో వీక్షించేందుకు రీడిజైన్ చేసింది. కొత్త సేకరణలతో పాటు రోజువారీ ఇష్టమైన వాటిని హైలైట్ చేసే వ్యూను కలిగి ఉంటుంది.

రీస్టోర్ చేసిన వాటిని కంట్రోలింగ్ సెంటర్ తరచుగా ఉపయోగించే నియంత్రణలకు త్వరిత యాక్సస్ అందిస్తుంది. థర్డ్ పార్టీ యాప్ ఇంటిగ్రేషన్ అనుమతిస్తుంది. మెసేజెస్ యాప్‌లోని శాటిలైట్ మెసేజ్ సెల్యులార్ లేదా వై-ఫై లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది. (iMessage) అప్‌గ్రేడ్‌తో కొత్త టెక్స్ట్ ఎఫెక్ట్‌లు, ఫార్మాటింగ్ ఆప్షన్లు, మెసేజ్ షెడ్యూలింగ్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ప్రత్యేకమైన ఫీచర్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఒకటి. లాంగ్వేజీపై అవగాహన, ఇమేజ్ క్రియేషన్ వంటి టాస్కులను మెరుగుపరచడానికి జనరేటివ్ మోడల్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది. అత్యంత ఉపయోగకరమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : India Semiconductor Industry : 2027 నాటికి సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌కు 3 లక్షల మంది నిపుణులు అవసరం!

ట్రెండింగ్ వార్తలు