iOS 19 Release : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ ఐఫోన్లలో iOS 19 అప్‌డేట్ వస్తోందోచ్.. ఏఐ ఫీచర్లు, మరెన్నో అప్‌గ్రేడ్స్..!

iOS 19 Release : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త iOS 19 సరికొత్త అప్‌డేట్ రిలీజ్ కానుంది. సపోర్టు చేసే ఐఫోన్ల జాబితాలో మీ మోడల్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.

iOS 19 Release

iOS 19 Release : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో iOS 19 కొత్త అప్‌డేట్ రిలీజ్ కానుంది. ఈ అప్‌డేట్ కోసమే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. iOS 19 ఫస్ట్ డెవలపర్ బీటా మరికొద్ది వారాల్లో రిలీజ్ కానుంది.

జూన్ 9న జరబగోయే (WWDC 2025) కీనోట్ తర్వాత రిలీజ్ కావచ్చు. iOS 19 మెయిన్ డిజైన్ ఓవర్‌హాల్, స్మార్ట్ ఏఐ పవర్డ్ ఫీచర్‌లు, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, ఇతర డివైజ్‌ల్లో వైడ్ రేంజ్ సపోర్టు తీసుకురానుంది. అయితే కొన్ని పాత ఐఫోన్లలో ఈ కొత్త అప్‌డేట్ అందుకోలేకపోవచ్చు.

Read Also : PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఏ అవసరానికి ఎంత తీసుకోవచ్చుంటే? ఫుల్ డిటెయిల్స్

కొత్త VisionOS :
రాబోయే ఫీచర్లలో బ్రాండ్-న్యూ డిజైన్ ఒకటి. జాన్ ప్రాసెర్ లీక్స్ ప్రకారం.. మరియుమార్క్ గుర్మాన్, iOS 19 విజువల్ ఎలిమెంట్‌ visionOSతో వస్తాయి. ఆపిల్ విజన్ ప్రో యూజర్లు అనేక ఆపిల్ యాప్‌లలో మెనూలు, గాజు లాంటి బటన్లు, రౌండర్ యాప్ ఐకాన్‌లు, కొత్త ఫ్లోటింగ్ ట్యాబ్ బార్‌ను చూడొచ్చు. iOS 7 తర్వాత అతిపెద్ద విజువల్ అప్‌డేట్ కావచ్చని గుర్మాన్ పేర్కొన్నారు.

RCS మెసేజింగ్‌కు బిగ్ అప్‌గ్రేడ్ :
ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య మెసేజ్‌లు మరింత అప్‌గ్రేడ్ అవుతాయి. iOS 19 RCS సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించనుంది. కన్వర్జేషన్ మరింత ప్రైవేట్‌గా సురక్షితంగా చేస్తుందని భావిస్తున్నారు. వినియోగదారులు మెసేజ్ ఎడిటింగ్, అన్‌సెండ్, ఇన్-లైన్ రిప్లయ్ వంటి ట్యాప్‌బ్యాక్ రియాక్షన్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాట్స్ iMessage మాదిరిగా అనిపించేలా ఉంటాయి.

ఎయిర్ పాడ్స్‌తో లైవ్ ట్రాన్సులేషన్ :
కొన్ని AirPods మోడళ్లలో వస్తున్న ప్రత్యేకమైన ఫీచర్ రియల్-టైమ్ ట్రాన్సులేషన్. మీ ఐఫోన్ వేరే భాషలో మాట్లాడేతే వినగలదు. ఆ పదాలను నేరుగా మీ AirPodsలోకి ట్రాన్సులేట్ చేయగలదు. మీ సమాధానాలను తిరిగి ట్రాన్సులేట్ చేయగలదు. వివిధ దేశాల వారితో కమ్యూనికేషన్‌ గతంలో కన్నా చాలా సులభంగా ఉంటుంది.

స్మార్ట్ హెల్త్ యాప్, SIRI అప్‌గ్రేడ్స్ :
హెల్త్ యాప్ ఏఐ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఆపిల్ ఆరోగ్య సలహాలు, నిపుణుల వీడియోలతో కోచింగ్ సిస్టమ్ అందించనుంది. అంతేకాకుండా, వినియోగదారులు త్వరలో తమ మీల్స్ నేరుగా యాప్‌లోనే ఆర్డర్ చేయొచ్చు.

MyFitnessPal వంటి పాపులర్ ఫిట్‌నెస్ యాప్‌లకు పోటీగా ఉంటుంది. సిరి ఆన్-స్క్రీన్ కంటెంట్‌ను మరింత ఈజీగా అర్థం చేసుకోగలదని భావిస్తున్నారు. అయితే, ఈ అప్‌గ్రేడ్స్ iOS 19.1 నుంచి 19.4 వంటి అప్‌డేట్స్ ద్వారా క్రమంగా అందుబాటులోకి రావచ్చు. ప్రధానంగా ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కొత్త ఐఫోన్లపై రన్ అవుతుంది.

EU రూల్స్‌తో కొన్ని మార్పులు :
కొత్త ఈయూ నిబంధనలతో ఆపిల్ iOSని మరింత అప్‌గ్రేడ్ చేస్తోంది. థర్డ్-పార్టీ స్మార్ట్‌వాచ్ సపోర్ట్, నాన్-యాపిల్ హెడ్‌ఫోన్‌లతో మెరుగైన ఆడియో స్విచింగ్, ఎయిర్ డ్రాప్, ఎయిర్ ప్లే కోసం ఇతర ఆప్షన్లలో iOS 19.2, 19.4 మధ్య వచ్చే అవకాశం ఉంది.

సపోర్టు చేసే ఐఫోన్ల లిస్టు ఇదే :

  • ఐఫోన్ 16e, ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మాక్స్
  • ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మాక్స్
  • ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మాక్స్
  • ఐఫోన్ SE 2వ జనరేషన్ లేదా ఆపై వెర్షన్

Read Also : OneUI 7 Update : శాంసంగ్ లవర్స్‌కు అలర్ట్.. ఈ ఫోన్లలోనే One UI 7 కొత్త అప్‌డేట్ వస్తోంది.. మీరు వాడే ఫోన్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి!

iOS 19 విడుదల తేదీ :
జూన్ 9 తర్వాత డెవలపర్లు బీటా వెర్షన్ పొందుతారు. iOS 19 ఫుల్ పబ్లిక్ రిలీజ్ సెప్టెంబర్ 2025లో రిలీజ్ కానుందని భావిస్తున్నారు.