PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఏ అవసరానికి ఎంత తీసుకోవచ్చంటే.. ఫుల్ డిటెయిల్స్

PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీరు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఈపీఎఫ్ఓ రూల్స్ తప్పక తెలుసుకుని ఉండాలి.

PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఏ అవసరానికి ఎంత తీసుకోవచ్చంటే.. ఫుల్ డిటెయిల్స్

EPFO Members

Updated On : May 7, 2025 / 5:40 PM IST

PF Claims Rule : ప్రస్తుత రోజుల్లో ఉద్యోగుల్లో ఎక్కువ శాతం పీఎఫ్ విత్‌డ్రా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అనుకోని ఖర్చుల నుంచి బయటపడేందుకు పీఎఫ్ డబ్బులపై ఆధారపడుతున్నారు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్స్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేయాలంటే ఎంత పడితే అంత తీసుకోవడానికి కుదరదు.

అలాగే, మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత విత్ డ్రా చేయగలరో అంతే చేసేందుకు వీలుంటుంది. నిబంధనలు, అర్హతలను బట్టి పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంతిల్లు, వైద్యం కోసం కూడా పీఎఫ్ డబ్బులను వాడుకోవచ్చు.

Read Also : MacBook Air M4 Price : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదంతే!

కొన్నిసార్లు ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులు తప్ప మరో అవకాశం ఉండకపోవచ్చు. అధిక మొత్తంలో రుణాలు తీసుకున్నవారు తప్పక పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేస్తుంటారు. విద్య, వైద్యం, వివాహం వంటి ఇతర అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ పరిశీలించొచ్చు. ఎంత మేర డబ్బులు విత్ డ్రా చేయగలమో అనేది పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

ఏయే అవసరాలకు విత్‌డ్రా చేయొచ్చుంటే? :
వివాహం, ఉన్నత విద్యకు ఈపీఎఫ్ డబ్బులను వినియోగించుకోవచ్చు. కొన్ని కఠిన నిబంధనలుఉన్నాయి. ఉద్యోగి కనీసం 7ఏళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడిగా ఉంటేనే క్లెయిమ్ చేయగలరు. జాబ్ జాయినింగ్ తేదీకి ఏడేళ్ల ముందు ఉండాలి. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు.

సర్వీస్ మొత్తంలో ఉన్నత విద్య, వివాహ అవసరాలు కలిపి మూడు సార్లు విత్‌డ్రా చేయొచ్చు. వైద్యం కోసం సర్వీస్‌తో సంబంధం ఉండదు. క్లెయిమ్ ఎన్నిసార్లు అనేది లేదు. వివాహం కోసం పీఎఫ్ డబ్బులను పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. ఉద్యోగి 50 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. వైద్యం కోసం అయితే కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్నిసార్లు అయినా విత్‌డ్రా చేయొచ్చు.

ఇల్లు కొనుగోలు కోసం ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్ చేయొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. జాయింట్ ప్రాపర్టీ కొనుగోలు చేయడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు, ఇంటి నిర్మాణం కోసం నెలవారీ జీతానికి 36 రెట్లు.. మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఇల్లు కట్టుకున్న ఐదేళ్ల తర్వాత క్లెయిమ్ చేయొచ్చు. ఉద్యోగి నెలవారీ వేతనం కింద 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. హోం లోన్ కట్టేందుకు కనీసం మూడేళ్ల సర్వీస్ ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90శాతం వెనక్కి తీసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం కనీసం ఏడేళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. మొత్తం 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 సార్లు విత్‌డ్రా చేయొచ్చు. వివాహం, విద్యకు వర్తిస్తుంది.

ఉద్యోగం కోల్పోతే ఎలా? :
ఉద్యోగం కోల్పోవడం లేదా మానేసినా నెలకు పైగా అలానే ఉంటే పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతం విత్‌డ్రా చేయొచ్చు. అదే రెండు నెలలు దాటిపోతే.. అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు. సంస్థలో ఉద్యోగం మానేశాక పీఎఫ్ ఖాతా ఖాళీ చేయనక్కర్లేదు. మరో కంపెనీలో చేరాక ఈ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు.

పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేయాలంటే? :

  • ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియను EPFO సులభతరం చేసింది.
  • ఈపీఎఫ్ ఇండియా పోర్టల్ వెళ్లి ‘Online Claims’ దగ్గర క్లిక్ చేయాలి.
  • UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి OTPతో లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత ‘Online Services’ సెక్షన్‌లో ‘Cliam Forum’ను ఎంచుకోవాలి.
  • UAN లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
  • పీఎఫ్ అడ్వా్న్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
  • మీ సర్వీస్ చేసే సంస్థ పేరు ఆప్షన్ చేసుకోవాలి.
  • క్లెయిమ్ కారణాన్ని ఎంచుకోవాలి.
  • మీ వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి.
  • మొబైల్ ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
  • క్లెయిమ్ అప్లికేషన్ స్టేటస్ కూడా ఇలానే లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
  • సంబంధిత చెక్ లీఫ్‌పై మెంబర్ పేరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి.
  • ఉమంగ్ (UMANG) యాప్ నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

క్లెయిమ్ చేసేందుకు అన్ని డాక్యుమెంట్లతో ఈపీఎఫ్‌వో ఆఫీసుకు వెళ్లొచ్చు. విత్ డ్రాయల్ ఫారమ్ నింపి డాక్యుమెంట్లను జత చేయాలి. ఆన్‌‌లైన్ క్లెయిమ్ దరఖాస్తు 3 నుంచి 4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే అటోమేటిక్‌గా జారీ అవుతుంది.

ఆఫ్‌లైన్‌లో ఇందుకు 10 రోజుల నుంచి 20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ బ్యాలన్స్‌పై ఎలాంటి లోన్ సదుపాయం ఉండదు. ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా కోసం స్టడీ సర్టిఫికెట్లు, మెడికల్ డాక్యుమెంట్ల సమర్పించాలి. ఈపీఎఫ్ క్లెయిమ్ ముందు కేవైసీ వివరాలు చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ వివరాలు సరిగా ఉండాలి. క్లెయిన్ దరఖాస్తు రిజెక్ట్ కాకుండా ఉంటుంది.

54 ఏళ్లు నిండిన తర్వాత మందస్తు విరమణతో 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్ 90 శాతాన్ని విత్ డ్రా చేయొచ్చు. ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత విత్‌డ్రా చేస్తే ఎలాంటి పన్ను ఉండదు. ఐదేళ్లలోపు సర్వీస్‌లో రూ.50వేలు మించి విత్‌డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ లేకపోయినా 20 శాతం టీడీఎస్ చెల్లించాలి.

Read Also : Amazon Summer Sale : మే 1 నుంచే అమెజాన్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13Rపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేస్తే వార్షిక ఆదాయంతో పన్ను చెల్లించాలి. పన్ను పరిధిలో లేకుంటే పీఎఫ్ మినహాయించిన టీడీఎస్ రిఫండ్ అభ్యర్థన చేయొచ్చు. ఒకవేళ జాబ్ నుంచి తొలగింపునకు గురికావడం లేదా కంపెనీ ఎత్తేసిన సందర్భాల్లో ఉద్యో గులు పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసినా సర్వీస్ ఐడేళ్లలోపు ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.