MacBook Air M4 Price : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదంతే!
MacBook Air M4 Price : ఆపిల్ అడ్వాన్స్‌డ్ M4 చిప్‌ను కలిగిన కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

MacBook Air M4 Price
MacBook Air M4 Price : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? మార్చి 2025లో వచ్చిన మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింపుతో లభ్యమవుతుంది. ఆపిల్ లేటెస్ట్ M4 చిప్ ద్వారా ఆధారితమైన కొత్తమ్యాక్‌బుక్ ఎయిర్ మునుపటి M3 వెర్షన్‌తో పోలిస్తే.. ఫాస్ట్ పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఆపిల్ ల్యాప్‌టాప్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డిస్కౌంట్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 (16GB ర్యామ్, 256GB స్టోరేజ్, సిల్వర్ కలర్, 13.6-అంగుళాల డిస్‌ప్లే) అసలు ధర రూ. 99,900కు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో నేరుగా 7శాతం తగ్గింపు తర్వాత రూ. 91,949కు అందుబాటులో ఉంది.
మీరు పాత మ్యాక్‌బుక్ ఎయిర్ M2తో ట్రేడ్ చేస్తే.. రూ. 25వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 66,949కి తగ్గుతుంది. అంతేకాదు.. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. అదనంగా రూ. 5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని ఆఫర్‌లతో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర కేవలం రూ. 61,949కి తగ్గుతుంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెషిఫికేషన్లు :
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 10-కోర్ CPU కలిగి ఉంది. మ్యాక్‌బుక్ M3 8-కోర్ చిప్ కన్నా మెరుగైనది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ మెరుగైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. ఆపిల్ రాబోయే “ఆపిల్ ఇంటెలిజెన్స్” ఫీచర్లు కోసం రెడీగా ఉంది. ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరికొన్ని ఫీచర్లు :
Read Also : Jio Recharge Offers : వారెవ్వా.. జియో కొత్త ప్లాన్ అదుర్స్.. ఈ సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!
- సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ సపోర్ట్‌తో 12MP ఫ్రంట్ కెమెరా
- డ్యుయల్ ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లే సపోర్టు
- స్పీడ్ ఇంటర్నెట్ కోసం Wi-Fi 6E
- MagSafe 3 ఛార్జింగ్, ప్లస్ థండర్‌బోల్ట్ 4/USB-C పోర్ట్‌లు
- 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే
- 53.8Wh బ్యాటరీతో 18 గంటల బ్యాటరీ లైఫ్
మీరు అప్‌గ్రేడ్ చేయాలా? :
మీరు ఇప్పటికీ M1 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ ఉపయోగిస్తుంటే.. M4కి అప్‌గ్రేడ్ చేసుకోండి. స్పీడ్, మల్టీ టాస్కింగ్ మరిన్ని కొత్త ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు. మీరు ఇప్పటికే M2 లేదా M3 మోడల్‌లో ఉంటే.. స్పీడ్ పర్ఫార్మెన్స్ తగినంతగా ఉండకపోవచ్చు.