Jio Recharge Offers : వారెవ్వా.. జియో కొత్త ప్లాన్ అదుర్స్.. ఈ సింగిల్ రీఛార్జ్‌‌తో ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

Jio Recharge Offers : లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? జియో ఇప్పుడు కేవలం రూ. 895కే 336 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, డేటా బెనిఫిట్స్, జియో ఫోన్, జియో భారత్ ఫోన్ యూజర్లు యాక్సస్ చేయొచ్చు.

Jio Recharge Offers : వారెవ్వా.. జియో కొత్త ప్లాన్ అదుర్స్.. ఈ సింగిల్ రీఛార్జ్‌‌తో ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

Jio Recharge Offers

Updated On : April 28, 2025 / 10:47 AM IST

Jio Recharge Offers : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 46 కోట్లకు పైగా యూజర్లు కలిగిన భారత అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం అద్భుతమైన లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది.

Read Also : BSNL 5G SIM Delivery : BSNL కొత్త 5G సిమ్ కావాలా? కేవలం 90 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఎలా బుక్ చేయాలంటే?

ఇప్పటికే నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయి ఉండి.. లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తుంటే.. జియో లేటెస్ట్ రూ. 895 ప్లాన్ తీసుకోవచ్చు. గత ఏడాది రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత కస్టమర్ల కోసం జియో మొత్తం పోర్ట్‌ఫోలియోను పునరుద్ధరించింది. టెలికాం దిగ్గజం ఇప్పుడు దీర్ఘకాలిక, వార్షిక ప్లాన్ల సంఖ్యను పెంచింది. ఏడాదికి ఒకసారి రీఛార్జ్‌లను ఇష్టపడే యూజర్లకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.

ప్రతి యూజర్‌కు వేర్వేరు కేటగిరీలు :
జియో రీఛార్జ్ పోర్ట్‌ఫోలియో అనేక కేటగిరీలుగా వర్గీకరించింది.

  • ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్లు
  • ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు
  • వార్షిక ప్లాన్లు
  • డేటా ప్యాక్‌లు
  • జియో ఫోన్, జియో భారత్ ఫోన్ ప్లాన్లు
  • వాల్యూ యాడెడ్ ప్లాన్లు
  • ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు
  • రూ. 895 ప్లాన్ తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

జియో రూ.895 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద జియో కేవలం రూ. 895కే 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ :
ప్రతి 28 రోజులకు 50 ఫ్రీ SMS, ప్రతి 28 రోజులకు 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 24GB డేటా లభిస్తుంది. యూజర్లకు డేటా లిమిట్ ఉన్నప్పటికీ బ్రౌజింగ్, మెసేజ్ పంపడం ఇమెయిల్స్ వంటి ఇంటర్నెట్ వినియోగానికి సరిపోతుంది.

Read Also : Samsung vs itel 5G : శాంసంగ్ గెలాక్సీ F06 5G, ఐటెల్ A95 5G.. ఫీచర్లు మాత్రం కేక.. రూ.10వేల లోపు ధరలో ఏది కొంటే బెటర్?

ఈ ప్లాన్‌ ఎవరికంటే? :
రీఛార్జ్ చేసే ముందు.. రూ. 895 ప్లాన్ ప్రత్యేకంగా జియో ఫోన్, జియో భారత్ ఫోన్ యూజర్లకు మాత్రమేనని గమనించండి. మీరు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్ వాడుతుంటే.. మీరు అర్హులు కారు. అయితే, జియో ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ ఏడాది వరకు ఎంజాయ్ చేయొచ్చు.